Share News

Cash Discovery Row: జస్టిస్ వర్మ బదిలీని నోటిఫై చేసిన కేంద్రం

ABN , Publish Date - Mar 28 , 2025 | 05:34 PM

భారత రాజ్యాంగంలోని 222వ నిబంధనలోని క్లాజ్ వన్ ద్వారా రాష్ట్రపతి తనకు సంక్రమించిన అధికారాలను ఉపయోగించుకుని భారత ప్రధాన న్యాయమూర్తితో సంప్రదింపులు జరిపి, ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మను అలాహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలనే సిఫారసు ఆమోదించారని ఆ ఉత్తర్వు తెలిపింది

Cash Discovery Row: జస్టిస్ వర్మ బదిలీని నోటిఫై చేసిన కేంద్రం

న్యూఢిల్లీ: పెద్ద ఎత్తున తన నివాసంలో నోట్ల కట్టలు కనిపించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న జస్టిస్ యశ్వంత్ వర్మ (Yashwant Varma) వ్యవహారంలో మరీ కీలక పరిణామం చోటు చేసుకుంది. దీనిపై ఒకవైపు సీజేఐ ఏర్పాటు చేసిన కమిటీ విచారణ జరుపుతుండగానే, అలహాబాద్ హైకోర్టుకు ఆయనను బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం శుక్రవారంనాడు నోటిఫై చేసింది.

Mamata Banerjee: భారత ఆర్థిక వృద్ధిపై మమత సంచలన వ్యాఖ్యలు.. అమమానకరమంటూ మండిపడిన బీజేపీ


భారత రాజ్యాంగంలోని 222వ నిబంధనలోని క్లాజ్ వన్ ద్వారా రాష్ట్రపతి తనకు సంక్రమించిన అధికారాలను ఉపయోగించుకుని భారత ప్రధాన న్యాయమూర్తితో సంప్రదింపులు జరిపి, ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మను అలాహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలనే సిఫారసు ఆమోదించారని ఆ ఉత్తర్వు తెలిపింది. జస్టిస్ వర్మ అలాహాబాద్ హైకోర్టులో బాధ్యతలు స్వీకరించాలని ఆదేశించినట్టు పేర్కొంది.


జస్టిస్ వర్మపై ఆరోపణల దుమారం నేపథ్యంలో ఆయనను తిరిగి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం ఇటీవల సిఫారసు చేసింది. అయితే ఈ నిర్ణయంతో అలబాహాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ విభేదించింది. జస్టిస్ వర్మను అలహాబాద్ హైకోర్టుతో సహా దేశంలోని ఏ కోర్టుకు బదిలీ చేయరాదని, ఆయనపై ఉన్న అభియోగాలపై పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలని, అభిశంసన చేపట్టాలని, ఆయన పాత కేసుల్లో తీర్పులను కూడా తిరగదోడాలని హైకోర్ట్ బార్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ క్రమంలోనే జస్టిస్ వర్మపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారంనాడు కొట్టివేసింది. ఈ వ్యహహారంపై సుప్రీంకోర్టు త్రిసభ్య కమిటీ విచారణ జరుపుతున్నందున ఈ దశలో ఎఫ్ఐఆర్ నమోదుకు ఆదేశించలేమని స్పష్టం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో అలహాబాద్ హైకోర్టుకు జస్టిస్ వర్మ బదిలీని కేంద్ర నోటిఫై చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.


ఇవి కూడా చదవండి..

Supreme Court: అంతర్గత విచారణ తర్వాతే ఎఫ్ఐఆర్.. జస్టిస్ వర్మపై పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీం

Bengaluru: మా చేతులు కట్టేశారు..

Maoist Letter: ఆపరేషన్ కగార్... మావోల సంచలన లేఖ

For National News And Telugu News

Updated Date - Mar 28 , 2025 | 05:36 PM