Home » Tirumala Tirupathi
Andhrapradesh: పురాతన మండపాలు శిథిలావస్థకు చేరుకుంటే మరమ్మతులు చెయొచ్చని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. కూలిపోయే పరిస్థితి ఉంటే జీర్ణోద్దరణ చెయ్యడంతో పాటు భక్తులకు అనువుగా మార్పులు చేయొచ్చన్నారు. దేశంలో చాలా ఆలయాల నిర్మాణాలు టీటీడీలో వేద విద్య అభ్యసించిన విద్యార్థుల సూచన మేరకు నిర్మిస్తున్నారని తెలిపారు. అలాంటిది టీటీడీలో పురాతన మండపాల శిథిలావస్థకు చేరుకుంటే మరమ్మతులు చెయ్యకూడదా అని ప్రశ్నించారు.
Andhrapradesh: వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వైకుంఠ ద్వారం గుండా స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తలు బారులు తీరారు. తెల్లవారుజామున 1:40 గంటల నుంచి 5:15 గంటల వరకు ప్రముఖులను శ్రీవారిని దర్శించుకునేందుకు టీటీడీ అనుమతి ఇచ్చింది.
వైకుంఠ ఏకాదశి ( Vaikuntha Ekadashi ) ని పురష్కరించుకుని డిసెంబరు 22వ తేదీ నుంచి తిరుపతిలో 9 ప్రాంతాల్లోని కౌంటర్లలో వైకుంఠ ద్వార దర్శనం ఉచిత టోకెన్ల జారీకి టీటీడీ ( TTD ) ఏర్పాట్లు చేసింది. డిసెంబరు 23వ తేదీ నుంచి జనవరి 1వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పించనున్నారు.
వైకుంఠ ఏకాదశి ( Vaikuntha Ekadashi ) ఏర్పాట్లపై అధికారులు, అర్చకులతో చర్చించామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి ( Eo Dharma Reddy ) తెలిపారు. సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 23వ తేదీ వేకువజామున 1.45నిమిషాల నుంచి భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనాన్ని ప్రారంభిస్తాం. 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి చెప్పారు.
Andhrapradesh: తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయం వెలుపల మీడియాతో భట్టి మాట్లాడుతూ.. రెండు రాష్ట్రాల ప్రజలు సంతోషంగా ఉండాలన్నారు.
NRI News: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా కొంతమంది అమెరికా ఎన్నారైలు తిరుమల కొండను కాలి నడకన చేరుకున్నారు. రేవంత్ రెడ్డికి అమెరికాలో అనేక మంది స్నేహితులు, అభిమానులు ఉన్నారన్న సంగతి అందరికీ తెలిసిందే.
టీటీడీ నిధుల మళ్లింపుపై చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ( BJP MP Laxman ) డిమాండ్ చేశారు. టీటీడీ అక్రమాలపై గురువారం నాడు రాజ్యసభలో లక్ష్మణ్ లేవనెత్తారు. ఎన్నికల్లో లబ్ధి కోసం టీటీడీ నిధులను తిరుపతి కార్పొరేషన్‌కు విడుదల చేస్తోందని చెప్పారు.
శ్రీవారి పాద పద్మాల చెంత పుట్టి.. అంచెలంచెలుగా ఏదిగానని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. నేడు తిరుమల శ్రీవారిని చంద్రబాబు దంపతులు దర్శించుకున్నారు. అలిపిరి వద్ద దాడి జరిగినప్పుడు శ్రీవారు కాపాడారన్నారు. కష్టం వచ్చినప్పుడు స్వామి వారిని మొక్కకున్నానన్నారు. ధర్మాన్ని కాపాడమని స్వామి వారిని ప్రార్ధించానన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు దంపతులు శ్రీవారిని దర్శించుకున్నారు. వైకుంఠ ద్వారం నుంచి ఆలయంలోకి ప్రవేశించారు. కాగా.. నేడు (శుక్రవారం) తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగానే ఉంది. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు 5 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి 4 గంటల సమయం పట్టింది.
తిరుమల కాలిబాటలో చిరుత దాడిలో మరణించిన లక్షిత కుంటుంబానికి 5 లక్షలు ఇవ్వకపోవడంపై ఏపీ హైకోర్ట్ ( AP High Court ) అభ్యంతరం తెలిపింది. కోర్టు ఆదేశించినా చెల్లించకపోవడం ఏమిటని టీటీడీపై కోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది.