Ramanaidu: వైసీపీ అబద్ధాలు, అసత్యాలకు బ్రాండ్ అంబాసిడర్.. మంత్రి నిమ్మల సెటైర్లు
ABN , Publish Date - Jul 12 , 2024 | 04:28 PM
అబద్ధాలు, అసత్యాలకు వైఎస్సార్‌సీపీ పార్టీ బ్రాండ్ అంబాసిడర్ అని మంత్రి నిమ్మల రామానాయుడు (Minister Nimmala Ramanaidu) విమర్శించారు.
పశ్చిమ గోదావరి: అబద్ధాలు, అసత్యాలకు వైఎస్సార్‌సీపీ పార్టీ బ్రాండ్ అంబాసిడర్ అని మంత్రి నిమ్మల రామానాయుడు (Minister Nimmala Ramanaidu) విమర్శించారు. యలమంచిలి జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు బ్యాగులు, యూనిఫామ్స్, పుస్తకాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మాట్లాడుతూ... మొన్న విశాఖ ఉక్కు ప్రైవేటు పరమవుతుందన్నారని, నిన్న ఉచిత ఇసుక అమలు కాదన్నారని... ఇవి అబద్ధమని తేలిపోవడంతో వారికి ఏం చేయాలో తెలియడం లేదని ఆక్షేపించారు. నేడు తల్లికి వందనం లేదు అంటూ మరొక అబద్ధం, అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
30 రోజుల పాలనలో అన్న మాట ప్రకారం పెన్షన్ సొమ్ము పెంపు, డీఎస్సీ, ఉచిత ఇసుక, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్లు హామీలను నెరవేర్చామని ఉద్ఘాటించారు. చదువుకునే అందరి పిల్లలకు అమ్మ ఒడి ఇస్తానని జగన్ రెడ్డి చెప్పి మోసం చేశారని మండిపడ్డారు. అందరికీ తల్లికి వందనం ఇస్తామని హామీ ఇచ్చారు. రూ.15వేలు అమ్మఒడిని రూ. 14వేలు, 13వేలుకి కోతతో పాటు ఒక ఏడాది పూర్తిగా ఎగ్గొట్టిన వైసీపీకి మాట్లాడే అర్హత లేదని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.