AP Elections: ఆ నియోజకవర్గాల్లో గెలుపు పక్కా.. కారణం అదే..!
ABN , Publish Date - May 01 , 2024 | 04:27 PM
ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడుతోంది. ఏ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు.. మెజార్టీ ఎంత.. ఏపార్టీ బలమెంత.. ఎక్కడ చూసినా ఇదే చర్చ. కొన్ని నియోజకవర్గాల్లో అయితే పక్కా గెలిచేదెవరో అక్కడి ప్రజలు బహిరంగంగానే చెప్పేస్తున్నారు. కొన్ని చోట్ల పోటాపోటీ ఉంటుందంటున్నారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో అయితే పక్కాగా టీడీపీ,జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులు గెలుస్తారంటూ వైసీపీ నాయకులే చర్చించుకుంటున్నారు. మూడు పార్టీలు కలవడంతో బలం పెరిగిందని, మరోవైపు వైసీపీపై వ్యతిరేకంగా ఉన్న ప్రజలంతా కూటమివైపే మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.

త్రిముఖ పోటీ ఉంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలే అవకాశం ఉండేదని, ప్రస్తుతం దాదాపు 175 నియోజకవర్గాల్లోనూ ద్విముఖ పోరే ఉండటంతో వైసీపీ భారీగా నష్టపోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉభయ గోదావరి జిల్లాల్లో 34 సీట్లు ఉండగా.. దాదాపు 20 నుంచి 25 సీట్లలో పక్కాగా కూటమి అభ్యర్థులు గెలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరో 5 నుంచి 10 నియోజకవర్గాల్లో ఎన్డీయే కూటమి, వైసీపీ అభ్యర్థుల మధ్య గట్టి పోటీ ఉన్నప్పటికీ..ఎక్కవు స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలిచే ఛాన్స్ ఉందట. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనసేన పోటీచేస్తున్న అన్ని స్థానాల్లో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.
YSRCP: అనంతలో పోలీస్ మార్క్ పాలిటిక్స్.. వైసీపీని వీడి టీడీపీలో చేరిన వారే టార్గెట్..
జనసేన తప్పకుండా గెలిచే సీట్లు..
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ రూరల్, పిఠాపురం, రాజోలు, గన్నవరం, రాజానగరం నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులు పోటీచేస్తున్నారు. 2019లో ఏపీ మొత్తంలో జనసేన గెలుచుకున్న ఒకేఒక సీటు రాజోలు. దీంతో ఈ నియోజకవర్గంలో జనసేనకు గట్టిపట్టున్న నియోజకవర్గంగా భావిస్తున్నారు. ఇక్కడ గెలుపు నల్లేరుపై నడకని జనసేన శ్రేణులు అంచనా వేస్తున్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీచేస్తుండటంతో ఈ నియోజకవర్గంతో పాటు.. దీనికి సమీపంలో ఉండే కాకినాడ రూరల్, రాజానగరం సీట్లపై ఈ ప్రభావం ఉంటుందని.. ఈ మూడు నియోజకవర్గాల్లో జనసేన గెలుపు ఈజీ అని భావిస్తున్నారు. ఇక గన్నవరంలో వైసీపీ, జనసేన మధ్య గట్టిపోటీ ఉన్నప్పటికీ.. కూటమి అభ్యర్థి గెలిచే అవకాశాలు అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది.
టీడీపీకి పక్కాగా..
పెద్దాపురం, మండపేట, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్ నియోజకవర్గాల్లో మాత్రమే 2019లో టీడీపీ గెలిచింది. మిగతా 15 నియోజకవర్గాల్లో ఓటమి చెందింది. ఈసారి జనసేన, బీజేపీతో పొత్తుపెట్టుకోవడంతో 13 నియోజకవర్గాల్లో టీడీపీ పోటీచేస్తుంది. కనీసం 11 నియోజకవర్గాల్లో గెలవచ్చని, మరొక నియోజకవర్గంలో గట్టి పోటీ ఉన్నప్పటికీ తక్కువ మెజార్టీతో గట్టెక్కవచ్చని టీడీపీ శ్రేణులు అంచనా వేస్తున్నారు. ఒక రంపచోడవరంలో మాత్రం వైసీపీ నుంచి గట్టిపోటీ ఉన్నట్లు తెలుస్తోంది. తుని, ప్రత్తిపాడు, పెద్దాపురం, కాకినాడ సిటీ, రామచంద్రాపురం, ముమ్మిడివరం, అమలాపురం, కొత్తపేట, మండపేట, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, జగ్గంపేట నియోజకవర్గాల్లో టీడీపీ పక్కా గెలుస్తుందని టీడీపీ శ్రేణులు అంచనా వేస్తున్నారు.
TDP: చీరాలలో నేడు చంద్రబాబు ప్రజాగళం
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read Latest AP News And Telugu News