AP Election 2024: మీ ఎమ్మెల్యే ఇంటికి అల్లు అర్జున్ వస్తే ఇలా చేస్తారా? ఇది తగునా?: చంద్రబాబు
ABN , Publish Date - May 11 , 2024 | 03:49 PM
Andhrapradesh: ‘‘నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డి ఇంటికి ఐకాన్ స్టార్, హీరో అల్లు అర్జున్ వస్తే.. ఎమ్మెల్యే అనుచరులు జనసేన జెండాలు పట్టుకుని తప్పుడు రాజకీయాలు చేస్తున్నారు. ఇది తగునా?. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆయన పార్టీ జెండాలు పట్టుకొని చీకటి రాజకీయాలు చేస్తున్నారు’’ అంటూ చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
నంద్యాల, మే 11: ‘‘నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డి (MLA Shilpa Ravichandrakishor Reddy) ఇంటికి ఐకాన్ స్టార్, హీరో అల్లు అర్జున్ (Hero Allu Arjun) వస్తే.. ఎమ్మెల్యే అనుచరులు జనసేన జెండాలు పట్టుకుని తప్పుడు రాజకీయాలు చేస్తున్నారు. ఇది తగునా?. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Janasena Chief Pawan Kalyan), ఆయన పార్టీ జెండాలు పట్టుకొని చీకటి రాజకీయాలు చేస్తున్నారు’’ అంటూ టీడీపీ చీఫ్ చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu) తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
AP Election 2024: వైసీపీ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలవాలని కోరుకుంటున్నా: అల్లు అర్జున్
నాకు ఆ తేదీ గుర్తొస్తోంది...
ఎన్నికల ప్రచారంలో భాగంగా నంద్యాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. ‘‘నంద్యాలకు రాగానే నాకు సెప్టెంబర్ 9వ తేదీ గుర్తుకు వస్తోంది. రాత్రి మీటింగ్ కంప్లీట్ చేసుకుని బస చేశాను. నిద్ర పోతున్నప్పుడు పోలీసులు దొంగల్లా వచ్చారు. నోటీసు ఇచ్చి అరెస్టు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. నేను మాజీ ముఖ్యమంత్రిని ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారని అడిగాను. ఎఫ్ఐఆర్ ఇవ్వమని అడిగాను. దారిలో ఇస్తామని చెప్పి ఇక్కడ నుంచి తీసుకెళ్లారు. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన సీనియర్, మాజీ ముఖ్యమంత్రిని నన్నే అక్రమంగా అరెస్టు చేశారు. ఇక సామాన్యుల ఓ లెక్కా. జైల్లో నన్ను చంపేస్తానంటూ భయపెట్టారు. నన్ను చంపేస్తానంటే ఎవరి మెడకు వాళ్ళు ఉరేసుకుని చావాల్సి వస్తుంది జాగ్రత్త. నేను ఎప్పుడు ప్రాణానికి భయపడలేదు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మెయిన్ టెన్ చేశాను. తిరుపతిలో నాపై క్లైమెర్ మెన్స్‌తో దాడి చేస్తే వెంకటేశ్వర స్వామి కాపాడారు’’ అని టీడీపీ చీఫ్ చెప్పుకొచ్చారు.
Viral Video: అతిథులకు భోజనం పెట్టే విషయంలో భారతీయులకు ఎవరూ సాటి రారట.. వీడియో వైరల్!
ఇలాంటి సైకో సీఎంను...
ఇవాళ సాయంత్రానికి ఎన్నికల ప్రచారం ముగుస్తుందన్నారు. రాష్ట్రాన్ని గట్టెక్కిస్తాననే విశ్వాసం తనకుందన్నారు. కర్నూలును న్యాయ రాజధాని చేస్తానని జగన్ చెప్పారని.. చేశారా? అని ప్రశ్నించారు. అమరావతిని బెస్ట్ రాజధాని చేయాలనుకున్నానని.. దాన్ని సైకో జగన్ నాశనం చేశారని మండిపడ్డారు. ‘‘విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తాడంటా. ఇడుపులపాయలో మీ నాన్న సమాధి వద్ద చేయ్’’ అంటూ కామెంట్స్ చేశారు. పోలవరం పూర్తి చేసి గోదావరి నీళ్లు, రాయలసీమకు నీళ్లు తీసుకొస్తానని హామీ ఇచ్చారు. నంద్యాల బై ఎలక్షన్‌లో రోడ్ల విస్తరణ చేస్తానని చెప్పానని... చేశానా లేదా అని అడిగారు. ఎన్డీయే కూటమితోనే నంద్యాల అభివృద్ధి అని చెప్పుకొచ్చారు. తన జీవితంలో ఇలాంటి సైకో ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదన్నారు. జగన్ రాయలసీమలో ఒక్క ప్రాజెక్టైనా కట్టారా... జగన్ రాయలసీమ ద్రోహి అని విరుచుకుపడ్డారు.
Elections 2024: పోలింగ్ కేంద్రం, ఓటు ఎక్కడుందో తెలుసుకోండిలా..!!
అలాంటి వాడు మనిషేనా?..
కులాలు మతాల పేర్లు చెప్పి జగన్ రాయలసీమలో అత్యధిక సీట్లు పొందారని.. కానీ రాయలసీమకు ఏమీ చేయలేదని విమర్శించారు. ఈ ఎన్నికల్లో రాయలసీమలో రివర్స్‌లో 52 సీట్లలో 49 సీట్లు గెలిపించాలని కోరారు. ‘‘జే బ్రాండ్ రద్దు చేస్తా. మీ ఆరోగ్యం కాపాడతా.. ధరల నియంత్రణ చేస్తా. కరెంటు కొరత ఉండదు. విద్యుత్ బిల్లులు పెంచం. ఇసుక మద్యం మాఫియాలను మరిచిపోయి ఫ్యాన్‌ను గెలిపిస్తే... మీ ప్రాంతానికి గొడ్డలి వస్తుంది. చెల్లెలు చీర పుట్టుక గురించి మాట్లాడే వాడు మనిషేనా. తల్లి శీలాన్ని రాజకీయాలకు వాడుకునే వాళ్ళని ఏమనాలి’’ అంటూ టీడీపీ చీఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆ దమ్ములేని వ్యక్తి జగన్..
ఎన్డీయే కూటమి మేనిఫెస్టోపై జనంలో చర్చ జరగాలన్నారు. జగన్ చేసిన అభివృద్ధి వల్ల బటన్ ఆగిపోయిందని.. నొక్కే పరిస్థితి కూడా లేదన్నారు. జనవరిలో డీపీటీకి బటన్ నొక్కితో మే నెలలో కూడా డబ్బులు జమ కాలేదన్నారు. జగన్, తాను చాలా రోజుల నుంచి ఎన్నికల ప్రచారం చేస్తున్నామని.. ఏ రోజు కూడా కొత్త విషయాలు చెప్పారా అని ప్రశ్నించారు. ‘‘ఈరోజు నేనొస్తే పధకాలు కొనసాగుతాయని జగన్ అంటున్నారు. భవిష్యత్తులో ఏం చేస్తాడో చెప్పే దమ్ము లేని వ్యక్తి జగన్’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. సూపర్ సిక్స్ పథకాలతో ప్రజల కష్టాలు తీరుస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి...
AP Elections: సాంబ వర్సెస్ సత్య.. వైసీపీ కీలక నేతకు ఘోర అవమానం!
Arvind Kejriwal: సీఎం పదవికి ఎందుకు రాజీనామా చేయలేదో చెప్పిన కేజ్రీ
Read Latest AP News And Telugu News