AP Election 2024: అక్రమంగా కేసులు పెట్టారు.. ఎన్నికల సంఘానికి టీడీపీ ఫిర్యాదు
ABN , Publish Date - May 22 , 2024 | 05:47 PM
ఏపీ ఎన్నికల సంఘానికి (Election Commission) తాడిపత్రిలో జరిగిన అల్లర్లపై తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) మరోసారి ఫిర్యాదు చేసింది. ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనాకు టీడీపీ నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ దీపకర్ రెడ్డి బుధవారం లేఖ రాశారు.
అనంతపురం: ఏపీ ఎన్నికల సంఘానికి (Election Commission) తాడిపత్రిలో జరిగిన అల్లర్లపై తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) మరోసారి ఫిర్యాదు చేసింది. ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనాకు టీడీపీ నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ దీపకర్ రెడ్డి బుధవారం లేఖ రాశారు. తాడిపత్రిలో జరిగిన అల్లర్లలో బాధితులైన టీడీపీ కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టారని లేఖలో వివరించారు. రాజంపేట డీఎస్పీ చైతన్య ఎవరి ఆదేశాలతో వచ్చి దాడులకు పాల్పడ్డారో అంతుబట్టడం లేదని సీఈసీ ఎంకే మీనా దృష్టికి నేతలు తీసుకొచ్చారు.
అస్మిత్ రెడ్డి ఇంటిపై డీఎస్పీ చైతన్య దాడికి పాల్పడి వ్యక్తిగత సిబ్బంది, డ్రైవర్లు, పొరుగువారిని గాయపరిచారని నేతలు తెలిపారు. తాడిపత్రి అల్లర్లలో తాను లేకపోయినా 307 సెక్షన్ కింద కేసు నమోదు చేశారని దీపక్ రెడ్డి చెప్పారు. జూన్ 4న అస్మిత్ రెడ్డితో పాటు కుటుంబ సభ్యులను కౌంటింగ్‌కు దూరంగా ఉంచాలని కుట్ర జరుగుతోందని ఉమా, దీపక్ రెడ్డి అన్నారు. తాడిపత్రి పోలీసుల ఏకపక్ష చర్యను నిలువరిస్తూ హక్కులను రక్షించాలని సీఈసీని దేవినేని ఉమామహేశ్వరరావు, దీపక్ రెడ్డి కోరారు.
లేఖలోని అంశాలు :-
► ఎన్నికల రోజున తాడిపత్రిలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దారెడ్డి, ఆయన కుమారుడు హింసను ప్రేరేపించడంతో పాటు పోలింగ్ బూత్ ల్లోకి అక్రమంగా చొరబడి ఓటర్లను భయబ్రాంతులకు గురి చేసి దాడులకు పాల్పడ్డారు.
► ఈ దాడుల్లో ఏఎస్పీ శ్రీరామకృష్ణతో పాటు సీఐ కూడా గాయపడ్డారు.
► పెద్దారెడ్డి తన అనుచరులతో టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి ఇంటిని చుట్టుముట్టి పోలీసులను కూడా లెక్కచేయకుండా మారణాయుధాలు, బాణసంచాలు కాల్చి బీభత్సం సృష్టించారు.
► అర్థరాత్రి రాజంపేట డీఎస్పీ చైతన్య ఎలాంటి అనుమతి లేకుండా తాడపత్రికి వచ్చి అస్మిత్ రెడ్డి ఇంటిపై దాడికి పాల్పడ్డారు.
► అస్మిత్ రెడ్డి ఇంటి చుట్టూ ఉన్న సుమారు 10 ఇళ్లలో విధ్వంసం సృష్టించి 51 మందిపై ఇష్టానుసారంగా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చేరారు.
► డీఎస్పీ చైతన్య ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడిలో జేసీ కుటుంబ డ్రైవర్లు, వ్యక్తిగత సిబ్బందితో పాటు పొరుగువారు కూడా గాయపడ్డారు.
► ఎమ్మెల్యే పెద్దారెడ్డి, తాను చెప్పింది చేసే వ్యక్తిగా పేరున్న డీఎస్పీ చైతన్య చేసిన ఈ దురాగతం చట్ట విరుద్ధం. ఎన్నికల కమిషన్ పర్యవేక్షణలో ఉన్న డీఎస్పీ చేసిన ఈ దుర్మార్గ పనులు వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనం.
► ఈ ఘటనలకు సంబంధించి అన్ని ఆధారాలను పోలీసులు, ఎన్నికల అధికారులకు అందించినప్పటికీ మాకు ఎటువంటి న్యాయం జరగలేదు.
► పోలీసుల సాయంతో ఎమ్మెల్యే, అతని అనుచరులు తాడిపత్రిలో చేసిన దారుణాలు భరించేవి కావు.
► ఈసీఐ ఆదేశాలతో నియమించబడ్డ సిట్‌కు ఈ సంఘటనలు పరిశీలించి దిద్దుబాటు చర్యలు చేపట్టడానికి సమయం దొరక్కపోవడం దిగ్భ్రాంతికి గురి చేసింది.
► అస్మిత్ రెడ్డి, సహచరుల ఇళ్లపై దాడులు చేయడానికి డీఎస్పీ చైతన్యకు ఎవరు ఆదేశాలు ఇచ్చారో ఈ రోజుకు అంతుబట్టలేదు.
► దాడులకు పాల్పడ్డవారిపై కాకుండా బాధితులపైన కూడా కేసులు నమోదు చేశారు. నిందితులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి.
► జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపు రోజున జేసీ.అస్మిత్ రెడ్డితో పాటు కుటుంబ సభ్యులు బయటకు రాకుండా చేసేందుకు పెద్దారెడ్డి ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.
► స్థానిక సంస్థల ఎన్నికల సమయం చేసిన అరాచకాలతో పాటు గత ఇరవై ఐదేళ్లుగా క్రూరమైన నేరాలకు పెద్దారెడ్డి పాల్పడ్డాడు.
► ప్రత్యర్థులపై దాడులకు పాల్పడతానన్న సంకేతాలను మీడియా ముందే బహిరంగంగా ప్రకటించినప్పటికీ పోలీసులు నివారణా చర్యలు చేపట్టకపోవడం విచారకరం.
► కానీ జేసీ కుటుంబ సభ్యులను మాత్రం తాడిపత్రి నుంచి వెళ్లిపోయేలా చేశారు. అనుచరులు, బంధువులపై కేసులు పెడతామని బెదిరించారు. ఎఫ్‌ఐఆర్ 90,91, 92, 94 సెక్షన్లతో పాటు 307 సెక్షన్లను నమోదు చేశారు.
► మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి ఎన్నికల రోజు, తర్వాత జరిగిన అల్లర్లలో పాల్గొనకపోయినప్పటికీ నిందితుల జాబితాల్లో పోలీసులు చేర్చారు.
► కౌంటింగ్ రోజు దూరంగా ఉంచాలన్న కారణంతో పవన్ రెడ్డిపైనా కేసులు నమోదు చేశారు.
► హక్కులను కాలరాయడంతో పాటు అస్మిత్‌రెడ్డి, కుటుంబ సభ్యులను పోలీసులు అక్రమంగా నిర్బంధించడం న్యాయాన్ని అపహాస్యం చేయడమే అవుతుంది.
► పోలీసుల ఏకపక్ష చర్యను కొనసాగిస్తూ జేసీ అస్మిత్‌రెడ్డితో పాటు, మద్దతుదారుల ప్రాథమిక హక్కులను హరించేలా చేస్తున్నారు.
► అస్మిత్ రెడ్డితో పాటు మద్దతుదారుల హక్కులను కాపాడాలి.
ఈ వార్తలు కూడా చదవండి..
ఫ్యాన్ పార్టీకి సీఈసీ చెక్..
అడ్డంగా దొరికిన ఎమ్మెల్యే పిన్నెల్లి..
అమిత్ సా వ్యాఖ్యాలపై కేజ్రీవాల్ ఆగ్రహం..
బెంగళూరు రేవ్ పార్టీలో కీలక సూత్రధారి ఎవరంటే..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News