Share News

CM Chandrababu: నాపై ఆ బాధ్యత కూడా ఉంది.. చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , Publish Date - Jun 29 , 2024 | 08:33 PM

ఐదేళ్లు ప్రజలు జగన్ ప్రభుత్వంలో ఎన్ని ఇబ్బందులు పడ్డారో వచ్చే విజ్ఞాపనలు చూస్తే అర్ధమవుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) అన్నారు. ప్రజా సమస్యలు ఎన్నో ఉన్నాయి, వాటన్నింటినీ పరిష్కరించాల్సిన బాధ్యత తనపై ఉందని తెలిపారు.

CM Chandrababu: నాపై ఆ బాధ్యత కూడా ఉంది.. చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
CM Nara Chandrababu Naidu

అమరావతి: ఐదేళ్లు ప్రజలు జగన్ ప్రభుత్వంలో ఎన్ని ఇబ్బందులు పడ్డారో వచ్చే విజ్ఞాపనలు చూస్తే అర్ధమవుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) అన్నారు. ప్రజా సమస్యలు ఎన్నో ఉన్నాయి, వాటన్నింటినీ పరిష్కరించాల్సిన బాధ్యత తనపై ఉందని తెలిపారు. పార్టీ కేంద్ర కార్యాలయo ఎన్టీఆర్ భవన్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు(శనివారం) ప్రజా సమస్యలపై వినతులు స్వీకరించారు. వినతులు వెల్లువలా వచ్చాయి. కార్యకర్తలు, శ్రేణుల నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు వినతులు స్వీకరించారు. భారీగా తరలివచ్చిన కార్యకర్తలతో పార్టీ కార్యాలయం కిక్కిరిసిపోయింది. వివిధ వర్గాల నుంచి వచ్చిన అనేక విజ్ఞాపనలు స్వీకరించారు.


చెమటతో తడిసిపోతూ కూడా ప్రజా వినతులు తీసుకునేందుకు సీఎం చంద్రబాబు ఎక్కువ సమయం కేటాయించారు. గత ప్రభుత్వం సరిగా చేయలేదు కాబట్టే, ఇన్ని సమస్యలతో ప్రజలు పోటెత్తుతున్నారని చెప్పారు. ప్రజా ఇబ్బందులు చూస్తుంటే ఎంతో బాధనిపిస్తోందని అన్నారు. గత ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వం దెబ్బతిన్న రహదారుల గుంతలు కూడా పూడ్చలేదని మండిపడ్డారు.ఇప్పుడు వర్షాకాలం ప్రారంభమవటoతో దెబ్బతిన్న రహదారులతో ప్రజలు నరకం చూస్తున్నారన్నారు. దెబ్బతిన్న రహదారుల గుంతలు పూడ్చే కార్యక్రమం కూడా వెంటనే చేపడతామని హామీ ఇచ్చారు. ప్రజాసమస్యల పరిష్కారానికి త్వరలోనే ఓ ప్రత్యేక వేదిక ఏర్పాటు చేస్తామని ఉద్ఘాటించారు. పార్టీ కార్యాలయంలో కూడా ప్రజా సమస్యలు గుర్తించి వాటికి సత్వర పరిష్కారం లభించేలా వచ్చే వారం నుంచి చర్యలు చేపడతామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.

Updated Date - Jun 29 , 2024 | 08:34 PM