Share News

Kollu Ravindra: నాసిరకం మద్యంతో పేదల జీవితాలతో ఆడుకున్నారు

ABN , Publish Date - Jun 14 , 2024 | 06:28 PM

యువతను మత్తులో పెట్టి, గంజాయికి బానిసలుగా వైసీపీ నేతలు మార్చారని ఎక్సైజ్, మైనింగ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర (Minister Kollu Ravindra) తెలిపారు. తన మీద నమ్మకం ఉంచి రెండు కీలక శాఖలు అప్పగించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు.

 Kollu Ravindra: నాసిరకం మద్యంతో పేదల జీవితాలతో ఆడుకున్నారు
Minister Kollu Ravindra

విజయవాడ: యువతను మత్తులో పెట్టి, గంజాయికి బానిసలుగా వైసీపీ నేతలు మార్చారని ఎక్సైజ్, మైనింగ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర (Minister Kollu Ravindra) తెలిపారు. తన మీద నమ్మకం ఉంచి రెండు కీలక శాఖలు అప్పగించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు(శుక్రవారం) ఏబీఎన్‌తో కొల్లు రవీంధ్ర మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వంలో మద్యం, ఇసుక మాఫియా దోచుకున్నాయని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార వ్యవస్థలను కూడా పూర్తిగా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు.


స్టిలరీలు , మద్యం కంపెనీలు మొత్తం వైసీపీ నేతలకే ఇచ్చారని చెప్పారు. నాసిరకం మద్యంతో పేదల జీవితాలతో వైసీపీ నేతలు అడుకున్నారని ధ్వజమెత్తారు. గంజాయిని కూడా విచ్చల విడిగా రవాణా చేయించారని విమర్శించారు. ఇసుక నిలిపివేసి నిర్మాణ రంగాన్ని నాశనం చేశారని దుయ్యబట్టారు. లక్షల మంది కార్మికులు పొట్ట కొట్టారని ఫైర్ అయ్యారు. ఇసుక దోపిడీతో కోట్లు‌ దోచుకుని ప్రజలకు కన్నీళ్లు మిగిల్చారని విమర్శించారు.


వారి అవినీతి, అక్రమాలు, సహకరించిన అధికారులపై విచారణ చేయించి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏపీలో నూతన మద్యం పాలసీ తో నాసిరకం మద్యం లేకుండా చేస్తామని అన్నారు. గంజాయి రవాణా పూర్తిగా అరికట్టే చర్యలు త్వరలో చేపడతామని అన్నారు. ప్రజలకు పూర్తిగా అందుబాటులో ఉండే విధంగా ఇసుక పాలసీ ఉంటుందని స్పష్టం చేశారు. చంద్రబాబు సారథ్యంలో సుపారిపాలనతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Home Minister Anita: ఆ కేసులను రీ ఓపెన్ చేస్తాం.. పోలీసులకు హోంమంత్రి అనిత వార్నింగ్

Chandrababu: కృతివెన్ను ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా

AP New Cabinet: ఏపీ మంత్రులకు శాఖలు కేటాయింపు.. పవన్, లోకేష్‌కు ఏమిచ్చారంటే..?

NMD Farooq: అఘోరా అలా చెప్పాడు.. ఇలా ఫరూక్ మంత్రి అయ్యాడు!

Yanamala:ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పని చేయాలి

Payyavula Keshav: ఏపీలో ప్రతిపక్షం ఉండాలి.. పయ్యావుల ఆసక్తికర వ్యాఖ్యలు

For More AP News and Telugu News..

Updated Date - Jun 14 , 2024 | 10:31 PM