Share News

Payyavula Keshav: ఏపీలో ప్రతిపక్షం ఉండాలి.. పయ్యావుల ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , Publish Date - Jun 14 , 2024 | 05:31 PM

ఏపీలో తప్పనిసరిగా ప్రతిపక్షం ఉండాలని కోరుకుంటున్నామని ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) వ్యాఖ్యానించారు. ఎందుకంటే వైఎస్సార్సీపీ అధినేత జగన్ రెడ్డిని ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి వచ్చి ప్రజల తరఫున మాట్లాడాలని కోరుకుంటున్నానని చెప్పారు.

Payyavula Keshav: ఏపీలో ప్రతిపక్షం ఉండాలి.. పయ్యావుల ఆసక్తికర వ్యాఖ్యలు
Payyavula Keshav

అమరావతి: ఏపీలో తప్పనిసరిగా ప్రతిపక్షం ఉండాలని కోరుకుంటున్నట్టు ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) అన్నారు. ఎందుకంటే వైఎస్సార్సీపీ అధినేత జగన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి వచ్చి ప్రజల తరఫున మాట్లాడాలని తాను కోరుకుంటున్నట్టు వ్యాఖ్యానించారు. నేడు (శుక్రవారం) ఏబీఎన్‌తో పయ్యావుల కేశవ్ మాట్లాడారు. శాసనసభకు జగన్ రావాలని కోరుకుంటున్నానని, గతంలో చంద్రబాబు మొదటిసారి సీఎం అయినప్పుడు నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న దివంగత నేత పీజేఆర్‌ను ఇంటికి వెళ్లి కలిశారని మంత్రి గుర్తుచేశారు. రాష్ట్రంలో ప్రతిపక్షం ఉండాలని ఆవశ్యకత ఉందని ఆయన పేర్కొన్నారు.


చంద్రబాబు ఒత్తిడిలో ఉన్నప్పుడే ఆయనలో నిజమైన స్ఫూర్తి బయటకు వస్తుందని కేశవ్ అన్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ప్రతిపక్షం మొత్తాన్ని సస్పెండ్ చేసి చంద్రబాబు ఒక్కరినే అసెంబ్లీలో ఉంచారని ఆయన గుర్తుచేశారు. అప్పుడే చంద్రబాబులో ఉన్న ఫైటింగ్ స్పిరిట్ బయటకు వచ్చిందని చెప్పుకొచ్చారు. రాష్ట్ర ఖజానా ఎంత ఉందో తాము ఇంకా చూడాల్సి ఉందన్నారు.


వైసీపీ ఐదేళ్ల పాలనలో నిధుల మళ్లింపు, భవిష్యత్ ఆదాయం తాకట్టు వంటి అనేక అవకతవకలు జరిగాయని పయ్యావుల కేశవ్ అన్నారు. కాగ్ కూడా ఈ మేరకు నివేదిక ఇచ్చిందని, , సంక్షేమానికి సమపాళ్లలో ప్రాధాన్యత ఇస్తామని ఆయన పేర్కొన్నారు. సంపద సృష్టి పేరుతో పన్నులు వేసేది లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు బ్రాండ్‌తో పరిశ్రమలు, ఐటీ కంపెనీలను ఏపీకి తీసుకువస్తామని పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Chandrababu: కృతివెన్ను ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా

AP New Cabinet: ఏపీ మంత్రులకు శాఖలు కేటాయింపు.. పవన్, లోకేష్‌కు ఏమిచ్చారంటే..?

NMD Farooq: అఘోరా అలా చెప్పాడు.. ఇలా ఫరూక్ మంత్రి అయ్యాడు!

For More AP News and Telugu News..

Updated Date - Jun 14 , 2024 | 05:58 PM