-
-
Home » Andhra Pradesh » Today Latest Breaking News and Live updates Allu Arjun Issue Pushpa Movie Hero Attended Police Enquiry latest News Live Updates Telugu 24th December 2024 Amar
-
Breaking News: ఎలా ఉన్నావ్ పుష్ప.. అల్లు అర్జున్‌కు మొదటి ప్రశ్న..
ABN , First Publish Date - Dec 24 , 2024 | 10:48 AM
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
Live News & Update
-
2024-12-24T14:57:24+05:30
ముగిసిన అల్లు అర్జున్ విచారణ..
చిక్కడపల్లి పిఎస్‌లో ముగిసిన అల్లు అర్జున్ విచారణ.
మూడు గంటలు పాటు విచారణ చేసిన పోలీసులు.
20 ప్రశ్నలను అల్లు అర్జున్ పై సంధించిన పోలీసులు.
మూడున్నర గంటల పాటు స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు.
అవసరమైతే మరోసారి నోటీస్ ఇస్తామన్న పోలీసులు.
మరోసారి విచారణ కు రావాల్సి ఉంటుంది అందుబాటలో ఉండాలని చెప్పిన పోలీసులు.
పోలీసులు సేకరించిన వీడియోలు, సిసి ఫుటేజ్ ను ముందు పెట్టి విచారణ చేసిన పోలీసులు.
అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ ను పోలీసులు రద్దు చేయాలని కోరే అవకాశం.
చిక్కడ పల్లి పీఎస్ నుండి జూబ్లీహిల్స్ నివాసానికి బయలుదేరిన అల్లు అర్జున్.
ఎస్కార్ట్ వాహనం తో చిక్కడ పల్లి పీఎస్ నుండి బయలుదేరిన అల్లు అర్జున్.
మరోసారి నోటీసులు ఇచ్చి విచారణ చేసే అవకాశం.
-
2024-12-24T11:21:12+05:30
అల్లు అర్జున్‌కు ఎదురైన మొదటి ప్రశ్న ఇదేనా..
పోలీసుల విచారణకు హాజరుకాగానే అల్లు అర్జున్‌కు పలకరింపు
పుష్ప ఎలా ఉన్నావ్ అంటూ మొదటి ప్రశ్న
-
2024-12-24T11:18:42+05:30
అల్లు అర్జున్‌ను అడిగే ప్రశ్నలు
సినిమా చూసేందుకు మీతో పాటు మీ కుటుంబ సభ్యులు ఎవరెవరు వచ్చారు
మీరు రోడ్ షో చేశారు కదా.. అనుమతి తీసుకున్నారా
రోడ్ షో చేయలేదంటున్నారు.. మీరు చేసింది రోడ్ షోనే కదా
అభిమానులు, పోలీసుల మీద దాడి చేసిన బౌన్సర్లు ఎవరు
రేవతి చనిపోయిన విషయాన్ని థియేటర్‌లో ఉన్నప్పుడు మీకు తెలిసిందా లేదా
రేవతి చనిపోయిన విషయాన్ని ఏసీపీ మీకు చెప్పారు కదా
మీకు ఎవరూ చెప్పలేదని మీరు మీడియా సమావేశంలో ఎందుకు చెప్పారు
-
2024-12-24T11:14:02+05:30
స్టేషన్‌కు చేరుకున్న బన్ని
చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న అల్లు అర్జున్
పుష్పను విచారించనున్న సీనియర్ అధికారులు
అల్లు అర్జున్‌ను ప్రశ్నించనున్న చిక్కడపల్లి ఏసీపీ రమేశ్, సీఐ రాజు
స్టేషన్ హౌస్ ఆఫీసర్ నేతృత్వంలో విచారణ
లీగల్ టీమ్‌తో స్టేషన్‌కు చేరుకున్న అల్లు అర్జున్
అల్లు అర్జున్‌తో పాటు స్టేషన్‌కు తండ్రి అల్లు అరవింద్, మామ చంద్రశేఖర్ రెడ్డి
-
2024-12-24T10:57:15+05:30
చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు అల్లు అర్జున్
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట కేసులో విచారణకు బయలుదేరిన అల్లు అర్జున్
తన నివాసం నుంచి చిక్కడపల్లికి అల్లు అర్జున్
కాసేపట్లో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు చేరుకోనున్న అల్లు అర్జున్