Share News

Viral Video: ఇంట్లోకి దూరిన ఎలుగుబంటిని చూపుడువేలితో బెదిరించగా.. చివరకు అది చేసిన నిర్వాకం చూడండి..

ABN , Publish Date - Jun 30 , 2024 | 06:11 PM

అటవీ సమీప ప్రాంతాల్లోకి జంతువులు చొరబడడం సర్వసాధారణంగా జరుగుతుంటుంది. అయితే పులులు, సింహాలు, ఏనుగులు, ఎలుగుబంట్లు చొరబడిన సందర్భాల్లో చివరకు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కొన్నిసార్లు ..

Viral Video: ఇంట్లోకి దూరిన ఎలుగుబంటిని చూపుడువేలితో బెదిరించగా.. చివరకు అది చేసిన నిర్వాకం చూడండి..

అటవీ సమీప ప్రాంతాల్లోకి జంతువులు చొరబడడం సర్వసాధారణంగా జరుగుతుంటుంది. అయితే పులులు, సింహాలు, ఏనుగులు, ఎలుగుబంట్లు చొరబడిన సందర్భాల్లో చివరకు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కొన్నిసార్లు ప్రాణనష్టం కూడా జరుగుతుంటుంది. అయితే అప్పుడప్పుడూ ఇలాంటి సమయాల్లో కూడా ఆశ్చర్యకర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఈ తరహా ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ పెద్ద ఎలుగుబంటి ఇంటి ఆవరణలోకి చొరబడుతుంది. ఈ క్రమంలో సదరు ఇంటి యజమాని.. దాన్ని చూపుడు వేలితో భయపెట్టాడు. చివరికి ఏం జరిగిందో మీరే చూడండి...


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఆటవీ ప్రాంతానికి సమీపంలోని ఓ ఇంటి ఆవరణలోకి పెద్ద ఎలుగుబంటి చొరబడుతుంది. దీంతో ఆ ఇంట్లోని వారంతా భయపడిపోతారు. అయితే ఇంటి యజమాని మాత్రం ఏమాత్రం భయం లేకుండా దాని వైపు చేయి చూపిస్తూ ‘‘బయటికి వెళ్లు’’.. అని ఆదేశిస్తూ చివరికి ఇనుప గేటు వరకూ తీసుకొస్తాడు. అయితే తీరా గేటు వద్దకు వెళ్లాక.. ఎలుగుబంటి బయటికి వెళ్లకుండా అక్కడే నిలబడిపోతుంది. దీంతో అతను మరింత ఆవేశంగా బయటికి వెళ్లు.. అని అరుస్తాడు.

Viral video: తారక్ చెప్పినట్లే జరిగింది.. చిరుత పులి సమీపానికి వెళ్లి ఫొటో తీయగా.. చివరకు..


ఈ క్రమంలో ఆగ్రహించిన ఎలుగుబంటి అతన్ని కాళ్లతో (bear trying to attack man) రక్కుతుంది. అయినా అతను భయపడకుండా, దాని వైపు చేయి చూపిస్తూ ‘‘బయటికి వెళ్తావా.. చితకబాదమంటావా’’.. అంటూ చివరిసారిగా హెచ్చరిస్తాడు. ఆ వ్యక్తి అలా అనడంతో ఏమనుకుందో ఏమో గానీ.. ఎలుగుబంటి ఏమీ అనకుండా అక్కడి నుంచి బయటికి వెళ్లిపోతుంది. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది.

Viral video: జింకను తినేందుకు మొసలి జిమ్మిక్కు.. చివరకు ఏం జరిగిందో చూస్తే.. అవాక్కవుతారు..


కాగా, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఎలుగుబంటికి చుక్కలు చూపించాడుగా’’.. అంటూ కొందరు, ‘‘విద్యా్ర్థిని టీచర్ భయపెట్టినట్లుగా ఉంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 18 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral video: నాగుపాము సమీపానికి వెళ్లిన తాబేలు.. సడన్‌గా కోబ్రా కాటేయడంతో.. చివరకు..

Updated Date - Jun 30 , 2024 | 06:11 PM