Share News

Viral video: జింకను తినేందుకు మొసలి జిమ్మిక్కు.. చివరకు ఏం జరిగిందో చూస్తే.. అవాక్కవుతారు..

ABN , Publish Date - Jun 30 , 2024 | 04:21 PM

మొసలి వేట ఎంతో భయకరంగా ఉంటుంది. నీటిలోకి వచ్చిన ఏ జంతువువైనా దాని కంటపడిందంటే.. ఆ వెంటనే నోటికి చిక్కిపోవాల్సిందే. అందుకే ఎంత పెద్ద జంతువైనా మొసలి సమీపానికి వెళ్లిడానికి కూడా...

Viral video: జింకను తినేందుకు మొసలి జిమ్మిక్కు.. చివరకు ఏం జరిగిందో చూస్తే.. అవాక్కవుతారు..

మొసలి వేట ఎంతో భయకరంగా ఉంటుంది. నీటిలోకి వచ్చిన ఏ జంతువువైనా దాని కంటపడిందంటే.. ఆ వెంటనే నోటికి చిక్కిపోవాల్సిందే. అందుకే ఎంత పెద్ద జంతువైనా మొసలి సమీపానికి వెళ్లిడానికి కూడా భయపడుతుంటాయి. అయితే కొన్నిసార్లు మొసళ్లకు షాక్ ఇచ్చే జంతువులూ ఎదురవుతుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ మొసలి జింకను తినేందుకు జిమ్మక్కు చేసింది. అయితే చాలా సేపటి నిరీక్షణ తర్వాత చివరకు షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ నీటి కుంటలో పెద్ద మొసలి (crocodile) ఆహారం కోసం ఒడ్డున వేచి చూస్తూ ఉంటుంది. ఇంతలో ఓ జింక నీళ్లు తాగేందుకు అటుగా వస్తుంది. దాన్ని చూడగానే మొసలికి ప్రాణాలు లేచొస్తాయి. ఎలాగైనా జింకను (deer) తినేయాలనే ఉద్దేశంతో తన నటనా ప్రావీణ్యాన్ని బయటపెడుతుంది. బురదలో కలిసిపోయిన మొసలి కదలకుండా అలాగే ఉండిపోతుంది.

Viral video: ఖరీదైన డ్రింక్స్‌‌లో ఐస్ ముక్కతో జరిగే మోసాన్ని.. కళ్లకు కట్టినట్లు చూపించాడుగా..


మొసలిని గమనిచిన జింక దాని పక్కలోనే నిలబడి నీళ్లు తాగుతుంటుంది. ఈ క్రమంలో అదును చూసి చివరకు (Crocodile attack on deer) మొసలి ఒక్కసారిగా జింకపై దాడి చేస్తుంది. నోరు తెరచి జింకను నీటిలోకి లాగేయాలని ప్రయత్నిస్తుంది. అయితే మొసలి ఇలా పైకి లేవగానే.. జింక వెంటనే అప్రమత్తమవుతుంది. క్షణాల వ్యవధిలో గాల్లోకి లేచి, ఎగురుకుంటూ పారిపోతుంది. దీంతో అప్పటిదాకా జింకను తినేయాలనుకున్న మొసలి ఆశలు.. చివరకు అడియాశలయ్యాయి.

Viral video: తారక్ చెప్పినట్లే జరిగింది.. చిరుత పులి సమీపానికి వెళ్లి ఫొటో తీయగా.. చివరకు..


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో..! ఈ మొసలి నటన మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘జింక భలే యాక్టివ్‌గా ఉంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral video: దూడకు జన్మనిచ్చిన గేదె.. పోలీసులకు ఫోన్ చేసిన వ్యక్తి.. ట్విస్ట్ ఏంటో తెలిస్తే.. నవ్వు ఆపుకోలేరు..

Updated Date - Jun 30 , 2024 | 05:01 PM