Share News

Viral video: తారక్ చెప్పినట్లే జరిగింది.. చిరుత పులి సమీపానికి వెళ్లి ఫొటో తీయగా.. చివరకు..

ABN , Publish Date - Jun 29 , 2024 | 06:19 PM

‘‘పులిని దూరం నుంచి చూడాలనిపించిందనుకో.. చూసుకో.. పులితో ఫోటో దిగాలనిపించిందనుకో.. కొంచెం రిస్క్ అయినా పర్లేదు ట్రై చేయొచ్చు.. సరే చనువిచ్చింది కదా అని పులితో ఆడుకుంటే మాత్రం.. వేటాడేస్తది ”.. అంటూ...

Viral video: తారక్ చెప్పినట్లే జరిగింది.. చిరుత పులి సమీపానికి వెళ్లి ఫొటో తీయగా.. చివరకు..

‘‘పులిని దూరం నుంచి చూడాలనిపించిందనుకో.. చూసుకో.. పులితో ఫోటో దిగాలనిపించిందనుకో.. కొంచెం రిస్క్ అయినా పర్లేదు ట్రై చేయొచ్చు.. సరే చనువిచ్చింది కదా అని పులితో ఆడుకుంటే మాత్రం.. వేటాడేస్తది ”.. అంటూ యమదొంగలో జూ.ఎన్టీఆర్ తనని తాను పులితో పోలుస్తూ చెప్పిన డైలాగ్ గుర్తుండే ఉంటుంది. అది సినిమా డైలాగ్ అయినా నిజ జీవితంలో ఎవరూ అలాంటి సాహసం చేయరు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో.. ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ తరహాలోనే నిజ జీవితంలోనూ జరిగింది. చిరుత పులి ముందు ఫొటో తీసుకుంటుండగా చివరికి ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఎలా వచ్చిందో, ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ.. ఓ చిరుత పులి రోడ్డు పక్కనే (tiger lying on next to the road) గడ్డిలో పడుకుని విశ్రాంతి తీసుకుంటోంది. అటుగా వెళ్లిన స్థానికులు దాన్ని చూసి షాక్ అయ్యారు. పులి గాయపడిందేమో, ఏమీ చేయలేదులే అనుకుని సమీపానికి వెళ్లి చూస్తారు. ఇలా కొద్ది సేపట్లోనే అక్కడ చాలా మంది గుమికూడతారు.

Viral video: విమానంలో గర్భిణికి ఇబ్బంది.. పట్టించుకోని మహిళకు.. వెనుక నుంచి షాకింగ్ ఝలక్..


చాలా మంది పులిని దూరం నుంచే చూస్తుంటారు. కొందరు దూరం నుంచి ఫొటోలు తీసుకుంటుంటారు. అయినా చిరుత పులి ఎటూ కదలకుండా అలాగే ఉండిపోతుంది. ఈ క్రమంలో ఓ వ్యక్తి మరో అడుగు ముందుకేసి దగ్గరగా వెళ్లి వీడియో (People taking video of cheetah) తీసేందుకు ప్రయత్నిస్తాడు. అప్పటికీ పులి ఏమీ అనకుండా కామ్‌గా ఉంటుంది. దీంతో అతడు రెచ్చిపోయి మరింత దగ్గరగా వెళ్లి పులిని వీడియో తీస్తూ ఇబ్బంది పెడతాడు.

Viral video: దూడకు జన్మనిచ్చిన గేదె.. పోలీసులకు ఫోన్ చేసిన వ్యక్తి.. ట్విస్ట్ ఏంటో తెలిస్తే.. నవ్వు ఆపుకోలేరు..


దీంతో పులి కూడా ఎన్టీఆర్ తరహాలోనే ‘‘చనువు ఇచ్చా కదా అని నాతోనే చెలగాటం ఆడతారా.. ఉండండి.. మీ పని చెబుతా’’.. అనుకుంటూ పైకి లేచి ఒక్కసారిగా (leopard chased people) వారి పైకి దూకుతుంది. దీంతో అక్కడున్న వారంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగందుకుంటారు. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. కాగా, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘పులితో ఆటలు ఆడితే ఇలాగే ఉంటుంది మరి’’.. అంటూ కొందరు, ‘‘పులిని తక్కువ అంచనా వేశారు పాపం’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral video: ట్రైన్ ముందు నిలబడి యువతి ఫోజ్.. ఇంజిన్ సమీపానికి రాగానే.. డ్రైవర్ చేసిన పనేంటంటే..

Updated Date - Jun 29 , 2024 | 07:50 PM