Share News

Viral video: ఖరీదైన డ్రింక్స్‌‌లో ఐస్ ముక్కతో జరిగే మోసాన్ని.. కళ్లకు కట్టినట్లు చూపించాడుగా..

ABN , Publish Date - Jun 29 , 2024 | 08:14 PM

కొన్ని విలాసవంతమైన హోటళ్లు, బార్లలో డ్రింక్స్, తినుబండారాల రేట్లు ఏ విధంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాలా మంది గొప్పలకు పోయి అధికంగా ఖర్చు చేస్తూ మందు, కూల్ డ్రింక్స్, వివిధ రకాల ఆహార పదార్థాలను తీసుకుంటుంటారు. అయితే..

Viral video: ఖరీదైన డ్రింక్స్‌‌లో ఐస్ ముక్కతో  జరిగే మోసాన్ని.. కళ్లకు కట్టినట్లు చూపించాడుగా..

కొన్ని విలాసవంతమైన హోటళ్లు, బార్లలో డ్రింక్స్, తినుబండారాల రేట్లు ఏ విధంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాలా మంది గొప్పలకు పోయి అధికంగా ఖర్చు చేస్తూ మందు, కూల్ డ్రింక్స్, వివిధ రకాల ఆహార పదార్థాలను తీసుకుంటుంటారు. అయితే కొన్ని చోట్ల హోటల్ నిర్వాకులు అనేక రకాల మోసాలకు పాల్పడుతుంటారు. అప్పడప్పుడూ ఇలాంటి మోసాలు వెలుగులోకి రావడం చూస్తుంటాం. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఖరీదైన డ్రింక్స్‌లో ఐస్ ముక్కతో జరిగే మోసాన్ని ఓ వ్యక్తి కళ్లకు కట్టినట్లు చూపించాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి టేబుల్ వద్ద కూర్చుని ఖరీదైన డ్రింక్స్ (Expensive drinks) ఆర్డర్ చేస్తాడు. కాసేపటికి సప్లయర్ ఓ ట్రేలో రెండు పొడవాటి గ్లాసుల్లో డ్రింక్స్ తీసుకుని వస్తాడు. అయితే ఆ డ్రింక్స్ చూడగానే అతడికి అనుమానం కలుగుంది. ‘‘ఏంటిది తక్కువగా ఉందే’’.. అని సప్లయర్‌ను అడగడంతో.. అంతే సార్ అని సమాధానం ఇస్తాడు. అయితే అతడు వెళ్లగానే కుర్చీలో కూర్చున్న వ్యక్తి అసలు మోసాన్ని (Cheating) బయటపెడతాడు. రెండు గ్లాసులో స్పూన్ పెట్టి లోప ఉన్న ఐస్ ముక్కలను (Ice cubes) బయటికి తీసి పక్కన పెడతాడు.

Viral video: దూడకు జన్మనిచ్చిన గేదె.. పోలీసులకు ఫోన్ చేసిన వ్యక్తి.. ట్విస్ట్ ఏంటో తెలిస్తే.. నవ్వు ఆపుకోలేరు..


తర్వాత ఒక గ్లాసులోని కూల్ డ్రింక్స్‌ని రెండో గ్లాసులో పోస్తాడు. ఒక గ్లాసులో సరిపోయే కూల్ డ్రింక్స్‌ని ఐస్ ముక్కలు వేసి రెండు గ్లాసుల్లో నింపి డబ్బులు దండుకుంటున్నారంటూ వివరిస్తాడు. హోటల్లో ఇలాంటి డ్రింక్స్‌ని ఆర్డర్ చేయొద్దని సూచిస్తాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ‘‘వామ్మో..! ఇదెక్కడి మోసంరా నాయనా’’.. అంటూ కొందరు, ‘‘ఐస్ ముక్కలతో భలే మోసం చేశారుగా’’.. అంటూ మరికొందరు, షాకింగ్ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2.50 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral video: తారక్ చెప్పినట్లే జరిగింది.. చిరుత పులి సమీపానికి వెళ్లి ఫొటో తీయగా.. చివరకు..

Updated Date - Jun 29 , 2024 | 09:07 PM