Share News

Viral video: దూడకు జన్మనిచ్చిన గేదె.. పోలీసులకు ఫోన్ చేసిన వ్యక్తి.. ట్విస్ట్ ఏంటో తెలిస్తే.. నవ్వు ఆపుకోలేరు..

ABN , Publish Date - Jun 28 , 2024 | 06:10 PM

కొందరు తెలిసీ తెలియక చేసే పనులు అందరికీ కోపం తెప్పిస్తే.. మరికొందరు చేసే పనులు తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. ఇంకొందరు చిత్రవిచిత్రమైన సమస్యలతో పోలీసులకు ఫోన్ చేస్తుంటారు. ఫోన్ రాగానే..

Viral video: దూడకు జన్మనిచ్చిన గేదె.. పోలీసులకు ఫోన్ చేసిన వ్యక్తి..  ట్విస్ట్ ఏంటో తెలిస్తే.. నవ్వు ఆపుకోలేరు..

కొందరు తెలిసీ తెలియక చేసే పనులు అందరికీ కోపం తెప్పిస్తే.. మరికొందరు చేసే పనులు తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. ఇంకొందరు చిత్రవిచిత్రమైన సమస్యలతో పోలీసులకు ఫోన్ చేస్తుంటారు. ఫోన్ రాగానే పోలీసులు కంగారుతో సంఘటన స్థలానికి వెళ్లగా చివరకు అవాక్కయ్యే పరిస్థితి ఎదురవుతుంటుంది. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ గేదె దూడకు జన్మనివ్వడంతో సదరు యజమాని పోలీసులకు ఫోన్ చేశాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు అతడు చెప్పింది విని షాక్ అయ్యారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) అమ్రోహా జిల్లా ఖుషల్‌పూర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రైతు జస్వీర్ సింగ్‌కు చెందిన గేదె ఇటీవల ఓ రోజు (buffalo gave birth to calf) దూడకు జన్మనిచ్చింది. దీంతో అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే ఆ సమయంలో అతడు చేసిన పనికి చివరకు అంతా అవాక్కయ్యారు. తన గేదెకు దూడ పుట్టగానే 112కు ఫోన్ చేశాడు.

Viral video: ఎంత ట్రాఫిక్ జామ్ అయితే మాత్రం... ఇలా ఎవరైనా చేస్తారా.. ఈ బైకర్‌ను చూసి అంతా షాక్..


ఏం జరిగిందో ఏమో అనే కంగారులో పోలీసులు (police) గ్రామానికి చేరుకున్నారు. సదరు రైతు ఇంటికి వెళ్లి.. ఏమైందని అడిగారు. ఇందుకు అతను.. ‘‘నాకు ఎలాంటి సమస్య లేదు సార్.. మా గేదెకు దూడ పుట్టింది. పాలు (milk) తాగుతారనే ఉద్దేశంతో మిమ్మల్ని పిలిచాను’’.. అని అన్నాడు. ఈ రైతు మాటలకు పోలీసులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. తన అన్నకు ఓ పోలీసు తెలుసునని, అందుకే అందరినీ పిలిచి పాలు అందించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. అయితే చివరికి రైతు అమాయత్వాన్ని అర్థం చేసుకుని పోలీసులు నవ్వుకున్నారు.

Viral video: మృతదేహాన్ని పక్కన పెట్టుకుని వీళ్లు చేస్తున్న పని చూస్తే.. నోరెళ్లబెడతారు..


ఇకపై ఇలాంటి పనులకు పోలీసులకు ఫోన్ చేసి, విలువైన సమయాన్ని వృథా చేయవద్దని సూచించారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ రైతు విచిత్రంగా ఉన్నాడే’’.. అంటూ కొందరు, ‘‘పోలీసులంటే ఈ రైతుకు ఎంత ప్రేమో’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 81వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral: గొంతులో దురదతో ఆస్పత్రికి వెళ్లగా.. పరీక్షించిన వైద్యులు షాక్.. చివరకు కారణమేంటని విచారించగా..

Updated Date - Jun 28 , 2024 | 06:10 PM