Share News

Viral video: వామ్మో..! పాకిస్థాన్‌లో ఇలా చేస్తారా.. కదులుతున్న రైలుపై ఆకతాయిలు నీళ్లు చల్లడంతో చివరకు ..

ABN , Publish Date - Jun 27 , 2024 | 05:59 PM

రైలు ప్రయాణ సమయాల్లో కొందరు ఆకతాయిలు ఏవేవో పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారు. కొందరు పట్టాలపై రూపాయి కాయిన్లు పెడుతుంటే.. మరికొందరు ఏవేవో వస్తువులను పట్టాలపై పెడుతూ తుంటరి పనులు చేస్తుంటారు. ఇలాంటి ..

Viral video: వామ్మో..! పాకిస్థాన్‌లో ఇలా చేస్తారా.. కదులుతున్న రైలుపై ఆకతాయిలు నీళ్లు చల్లడంతో చివరకు ..

రైలు ప్రయాణ సమయాల్లో కొందరు ఆకతాయిలు ఏవేవో పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారు. కొందరు పట్టాలపై రూపాయి కాయిన్లు పెడుతుంటే.. మరికొందరు ఏవేవో వస్తువులను పట్టాలపై పెడుతూ తుంటరి పనులు చేస్తుంటారు. ఇలాంటి పనులు చేసినా రైళ్లు ఆగే పరిస్థితి ఉండదని, తమను ఎవరూ ఏమీ చేయరనే ధైర్యంతో ఉంటారు. అయితే తాజాగా వైరల్ అవుతున్న వీడియో చూస్తే.. ఇలాంటి పనులు చేయడానికి ఎవరూ సాహసం చేయరు. పాకిస్థాన్‌లో కదులుతున్న రైలుపై నీళ్లు చల్లడంతో చివరకు ఏం జరిగిందంటే..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన పాకిస్థాన్‌లో (Pakistan) చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. కొందరు యువకులు రైలు పట్టాల పక్కన ఉన్న నీటి కాలువ వద్ద బైకు ఆపుకొని నిలబడి ఉంటారు. కాసేపటి తర్వాత బైకు స్టాండ్ వేసి స్టార్ట్ చేస్తారు. వెనుక టైరు వేగంగా తిరగడం వల్ల నీళ్లన్నీ పైకి ఎగిరుతుంటాయి. అదే సమయంలో ఓ రైలు అటుగా వస్తుంది. నీళ్లన్నీ రైలు (Youth sprinkled water on running train) బోగీల్లోకి చొచ్చుకుపోతాయి.

Viral video: నిద్రిస్తుండగా బాలుడి లోదుస్తుల్లోకి దూరిన పాము.. చివరకు..


నీళ్లు రైలు బోగీలపై పడడాన్ని సదరు యువకులు ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఇంతలో వారెవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. నీళ్లు ప్రయాణికులపై పడడంతో చివరకు డ్రైవర్‌కు చెప్పి ఏకంగా రైలునే ఆపేస్తారు. తర్వాత రైల్వే సిబ్బందితో పాటూ పలువురు ప్రయాణికులు ఆగ్రహంతో కిందకు దిగి యువకుల వైపు వస్తారు. వారిని చూసి అంతా పారిపోవాలని ప్రయత్నిస్తారు. అయితే చివరకు వారిని వెంటబడి పట్టుకుని చితకబాదుతారు.

Viral video: వేటాడే ముందు సాలీడు ఏం చేస్తుందో ఎప్పుడైనా చూశారా.. కళ్లకు కట్టినట్లు చూపించాడుగా..


యువకులను చితకబాదిన అనంతరం వారితో పాటూ బైకును కూడా రైలు ఎక్కించి తీసుకెళ్తారు. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. కాగా, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి ఆకతాయిలకు ఇలాగే జరగాలి’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి పనులు ఎవరూ చేయొద్దు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral video: వర్షంలో డాన్స్ చేస్తూ వైరల్ అవ్వాలనుకుంది.. మొదట్లోనే ఇలా జరుగుతుందని ఊహించలేకపోయింది..

Updated Date - Jun 27 , 2024 | 06:02 PM