Share News

Viral video: నాగుపాము సమీపానికి వెళ్లిన తాబేలు.. సడన్‌గా కోబ్రా కాటేయడంతో.. చివరకు..

ABN , Publish Date - Jun 30 , 2024 | 05:00 PM

విషపూరితమైన పాముల్లో నాగుపాము ఒకటి. ఒక్కసారిగా ఇది కాటేస్తే దాదాపు ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిందే. అయినా కొన్నిసార్లు పాములతో మనుషులతో పాటూ జంతువులూ..

Viral video: నాగుపాము సమీపానికి వెళ్లిన తాబేలు.. సడన్‌గా కోబ్రా కాటేయడంతో.. చివరకు..

విషపూరితమైన పాముల్లో నాగుపాము ఒకటి. ఒక్కసారిగా ఇది కాటేస్తే దాదాపు ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిందే. అయినా కొన్నిసార్లు పాములతో మనుషులతో పాటూ జంతువులూ ఆడుకోవడం చూస్తుంటాం. కోతులు, కుక్కలు తదితర జంతువులు నాగు పాములతో చెలగాటం ఆడుతుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా నాగుపాము, తాబేలు వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ తాబేలు నాగుపాము సమీపాని వెళ్లింది. ఈ క్రమంలో కోబ్రా సడన్‌గా కాటేయడంతో చివరకు ఏం జరిగిందో చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. బుసలు కొడుతున్న ఓ నాగుపాము వద్దకు తాబేలు వెళ్తుంది. తాబేలు సమీపానికి రావడం చూసి నాగుపాము ముందుగా పడగెత్తి బుసలు కొట్టి హెచ్చరిస్తుంది. అయినా తాబేలు మాత్రం ‘‘తగ్గేదేలే’’.. అన్నట్లుగా దాని సమీపానికి దూసుకెళ్తుంది. దీంతో కోబ్రాకు చిర్రెత్తికొచ్చి కాటేసి చంపేయాలని చూస్తుంది. దగ్గరికి వచ్చిన (cobra bite turtle) తాబేలును కాటేస్తుంది.

Viral video: తారక్ చెప్పినట్లే జరిగింది.. చిరుత పులి సమీపానికి వెళ్లి ఫొటో తీయగా.. చివరకు..


తాబేలు ధృడమైన డొప్ప ముందు పాము కాటు ఏమీ చేయలేకపోయింది. కాటేసిన నాగుపాము చివరకు ఖంగుతింటుంది. పాము కాటేసినా తాబేలు ఏమాత్రం జంకకుండా.. ‘‘నువ్వు నన్ను ఏమీ చేయలేవు’’.. అన్నట్లుగా దాని వైపు చూస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘తాబేలు డొప్ప ముందు తన ఆటలు సాగవని పాము తెలీనట్లుంది’’.. అంటూ కొందరు, ‘‘తాబేలా మజాకా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral video: జింక తినేందుకు మొసలి జిమ్మిక్కు.. చివరకు ఏం జరిగిందో చూస్తే.. అవాక్కవుతారు..

Updated Date - Jun 30 , 2024 | 05:00 PM