Share News

Viral Video: పెళ్లి వేదికపై వధూవరులు.. సడన్‌గా సమీపానికి వచ్చిన కుక్క.. చివరకు..

ABN , Publish Date - Jul 02 , 2024 | 07:44 PM

వివాహ కార్యక్రమాల్లో వధూవరుల మధ్య కొన్నిసార్లు ఆసక్తికర ఘటనలు.. ఇంకొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకోవడం చూస్తుంటాం. ఇలాంటి ఘటనలు కొన్నిసార్లు అనుకోకుండా జరిగితే.. మరికొన్నిసార్లు..

Viral Video: పెళ్లి వేదికపై వధూవరులు.. సడన్‌గా సమీపానికి వచ్చిన  కుక్క.. చివరకు..

వివాహ కార్యక్రమాల్లో వధూవరుల మధ్య కొన్నిసార్లు ఆసక్తికర ఘటనలు.. ఇంకొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకోవడం చూస్తుంటాం. ఇలాంటి ఘటనలు కొన్నిసార్లు అనుకోకుండా జరిగితే.. మరికొన్నిసార్లు వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో కావాలని ప్లాన్ చేసి మరీ క్రియేట్ చేస్తుంటారు. ఏది ఏమైనా పెళ్లికి సబంధించిన ఎలాంటి వీడియో అయినా.. సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అవుతుంటుంది. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వివాహ కార్యక్రమంలో వధూవరులు వేదికపై ఉండగా.. ఓ కుక్క సడన్‌గా వారి వద్దకు వెళ్లింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. వధూవరులు (bride and groom) వేదికపై ఉండగా ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. ఉన్నట్టుండి ఓ పెంపుడు కుక్క (pet dog) వధువు సమీపానికి వస్తుంది. వేగంగా రావడంతో.. ఎక్కడ తనపై దాడి చేస్తుందేమో అని అనుకుని భయపడుతుంది. వెంటనే పైకి లేచి అటూ, ఇటూ పరుగులు పెడుతుంది. ఈ క్రమంలో అక్కడున్న వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడిపోతాయి. వధువు అటూ ఇటూ పరుగెడుతుంటే.. కుక్క కూడా ఆమెను వదలకుండా వెంటపడుతుంది. దీంతో కాసేపటికే వేదిక మొత్తం చెల్లాచెదురుగా మారిపోతుంది.

Viral Video: మొసలి, కొండచిలువ మధ్య భయంకర పోరాటం.. చివరకు ఎవరూ ఊహించని ట్విస్ట్..


ఈ ఘటనతో వేదికపై ఒక్కసారిగా గందరగోళ వాతావరణం ఏర్పడుతుంది. చివరకు వరుడు కలుగజేసుకుని కుక్కను గట్టిగా అదిలించి పక్కకు పంపిస్తాడు. దీంతో ఎట్టకేలకు అంతా హమ్మయ్య.. అనుకుంటూ ఊపిరి పీల్చుకుంటారు. అయితే ఈ ఘటన చూస్తుంటే ఇదంతా కావాలని ప్లాన్ చేసినట్లు ఉన్నా కూడా వీడియో మాత్రం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ కుక్క భలే కామెడీగా ఉందిగా’’.. అంటూ కొందరు, ‘‘అందరూ బాగా యాక్ట్ చేశారు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: బట్టలు ఉతుకుతున్నప్పుడు కూడా అదే పనా.. వామ్మో..! ఈమె టెక్నిక్ మామూలుగా లేదుగా..

Updated Date - Jul 02 , 2024 | 07:44 PM