Share News

Viral video: వర్షంలో డాన్స్ చేస్తూ వైరల్ అవ్వాలనుకుంది.. మొదట్లోనే ఇలా జరుగుతుందని ఊహించలేకపోయింది..

ABN , Publish Date - Jun 26 , 2024 | 09:33 PM

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఎక్కువ శాతం మంది ఏదోటి చేసి ఫేమస్ అవ్వాలని ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో మిగతా వారి కంటే ఏదైనా భిన్నంగా చేయాలని ప్లాన్ చేస్తుంటారు. ఈ క్రమంలో..

Viral video: వర్షంలో డాన్స్ చేస్తూ వైరల్ అవ్వాలనుకుంది.. మొదట్లోనే ఇలా జరుగుతుందని ఊహించలేకపోయింది..

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఎక్కువ శాతం మంది ఏదోటి చేసి ఫేమస్ అవ్వాలని ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో మిగతా వారి కంటే ఏదైనా భిన్నంగా చేయాలని ప్లాన్ చేస్తుంటారు. ఈ క్రమంలో కొందరు ఏం చేస్తున్నారో వారికే తెలీనంతలా మారిపోతుంటారు. మరికొందరు ఎండా.. వానా.. ఇలా అన్ని కాలాలను తమ రీల్స్‌కు అనుకూలంగా మార్చుకుంటుంటారు. అయితే ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, ఓ యువతికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. వర్షంలో డాన్స్ చేసి రీల్ చేయాలనుకోగా.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. బీహార్‌లోని (Bihar) సీతామర్హిలో ఈ ఘటన చోటు చేసుకుంది. వర్షం కురుస్తుండడం చూసి ఓ యువతి రీల్ చేయాలని తన ఇంటి పైకి వెళ్లింది. ఫోన్‌ను (young woman doing reels in rain) స్టాండ్‌పై పెట్టి.. వర్షంలోకి వెళ్లింది. అయితే తీరా డాన్స్ చేసే క్రమంలో ఒక్కసారిగా.. ఆమెకు కాస్త దూరంలోనే ఫెడేల్‌మని (thunderbolt) పిడుగు పడుతుంది. ఆ శబ్ధానికి సదరు యువతి చెవులు మూసుకుని ఇంట్లోకి పరుగెడుతుంది. పిడుగు దూరంగా పడడంతో ఆమెకు ఎలాంటి ప్రమాదమూ జరగలేదు. ఈ ఘటన మొత్తం ఫోన్ కెమెరాలో రికార్డ్ అయింది.

Viral video: నరాలు తెగే ఉత్కంఠ.. జిరాఫీని చుట్టుముట్టిన సింహాలు.. చివరకు ఎవరూ ఊహించని ట్విస్ట్..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘యమరాజు వేరే పనుల్లో బిజీగా ఉన్నట్టున్నాడు’’.., ‘‘ఇంకోసారి ఇలా చేయకంటూ వరుణుడి వార్నింగ్ ఇచ్చాడు’’.., ‘‘ఇంట్లోకి వెళ్లి ఇష్టదైవాన్ని ప్రార్థించుకో’’.., ‘‘కొందతీసి యముడు కూడా రీల్స్ చేస్తూ బిజీగా ఉన్నాడేమో’’.., ‘‘ మొత్తానికి ఈ యువతి మంచి రీల్ వచ్చింది’’.., ‘‘వర్షాకాలంలో ఇలాంటి తప్పులు ఎవరూ చేయొద్దు’’.. అంటూ ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తుంటే.. మరికొందరు ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 48 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral video: ఇలాంటివన్నీ ఇక్కడే జరుగుతుంటాయేమో.. ఈ మెట్రోలో ప్రేమికుల నిర్వాకం చూస్తే..

Updated Date - Jun 26 , 2024 | 09:33 PM