Share News

Viral: ఒకే ఇంట్లో మూడోసారి చోరీకి వెళ్లిన దొంగ.. బెడ్రూంలో దంపతులను నగ్నంగా చూసి.. చివరకు..

ABN , Publish Date - Jun 30 , 2024 | 08:15 PM

చోరీలకు పాల్పడే సమయంలో దొంగలు సాధారణంగా నగలు, నగదు ఎత్తుకెళ్లడం చేస్తుంటారు. ఈ సమయాల్లో అడ్డు వచ్చిన వారిని చంపుతామని బెదిరిస్తుంటారు. అయితే కొందరు దొంగలు చోరీ సమయాల్లో..

Viral: ఒకే ఇంట్లో మూడోసారి చోరీకి వెళ్లిన దొంగ.. బెడ్రూంలో దంపతులను నగ్నంగా చూసి.. చివరకు..
ప్రతీకాత్మక చిత్రం

చోరీలకు పాల్పడే సమయంలో దొంగలు సాధారణంగా నగలు, నగదు ఎత్తుకెళ్లడం చేస్తుంటారు. ఈ సమయాల్లో అడ్డు వచ్చిన వారిని చంపుతామని బెదిరిస్తుంటారు. అయితే కొందరు దొంగలు చోరీ సమయాల్లో ఇందుకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తుంటారు. తాజాగా, ఛత్తీస్‌గఢ్‌లో చోటు చేసుకున్న ఘటనే ఇందుకు నిదర్శనం. ఒకే ఇంట్లోకి మూడోసారి చోరీకి వెళ్లిన దొంగ చివరకు వారి బెడ్రూం వైపు వెళ్లాడు. లోపల దంపతులు నగ్నంగా ఉండడం చూసి అతను చేసిన నిర్వాకం ఏంటంటే..


సోషల్ మీడియాలో ఓ వార్త (Viral News) తెగ వైరల్ అవుతోంది. ఛత్తీస్‌గఢ్‌లోని (Chhattisgarh) దుర్గ్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. సాహు జిల్లాలోని నందిని పోలీస్ స్టేషన్ పరిధిలోని అహివర గ్రామానికి చెందిన వినయ్ కుమార్ సాహు అనే వ్యక్తి చోరీలకు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో అతను దుర్గ్ జిల్లా పరిధిలోని ఓ ఇంట్లో చోరీకి (theft) పాల్పడ్డాడు. అంతటితో ఆగని ఆ దొంగ అదే ఇంట్లో వరుసగా రెండుసార్లు చోరీకి పాల్పడ్డాడు.

Viral Video: ఇంట్లోకి దూరిన ఎలుగుబంటిని చూపుడువేలితో బెదిరించగా.. చివరకు అది చేసిన నిర్వాకం చూడండి..


అయితే కొన్నాళ్ల తర్వాత మళ్లీ మూడోసారి ఆ ఇంట్లోకి చోరీకి పాల్పడ్డాడు. అయితే ఆ సమయంలో అతను ఆ ఇంటి బెడ్రూం (bedroom) వైపు వెళ్లాడు. లోపల నగ్నంగా ఉన్న దంపతులను (couple) చూసి తన ఫోన్‌లో వీడియో (Video) తీశాడు. తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయి.. సదరు ఇంటి యజమాని వాట్సప్‌ నంబర్‌కు జూన్ 17న వీడియోను పంపించాడు. తనకు రూ.10లక్షల నగదు కావాలని, ఇవ్వకుంటే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని (Threats) బెదిరించాడు. దీంతో భయపడిపోయిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Viral Video: బీచ్‌లో ఉన్నట్టుండి మాయమైన యువతి టవల్.. చివరకు కొండచిలువ నిర్వాకం తెలుసుకుని అంతా షాక్..


దంపతుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఎట్టకేలకు జూన్ 25న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి మూడు మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, చాలా సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాశాడు. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసిన గవర్నమెంట్ ఉద్యోగం రాలేదు. దీంతో చివరకు ఫోన్లు తదితర వస్తువులు చోరీ చేయడం ప్రారంభించాడు. ఇలా చివరకు చోరీలకు అలవాటుపడ్డాడని పోలీసులు తెలిపారు. కాగా, ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

Viral video: నాగుపాము సమీపానికి వెళ్లిన తాబేలు.. సడన్‌గా కోబ్రా కాటేయడంతో.. చివరకు..

Updated Date - Jun 30 , 2024 | 08:15 PM