Viral Video: కనీవినీ ఎరుగని వంటకం.. వేపాకులతో ఇతడు చేసిన ప్రయోగం చూస్తే..
ABN , Publish Date - Jul 02 , 2024 | 05:11 PM
వింత వింత రెసిపీలతో విచిత్ర వంటలను చేసే వాళ్లను తరచూ చూస్తుంటాం. కొందరు అటుకుల్లో అరటిపండు, రసగుల్లా, పాలు, పెరుగు వంటివి వేసి సరికొత్త ప్రయోగం చేస్తే.. ఇంకొందరు ...
వింత వింత రెసిపీలతో విచిత్ర వంటలను చేసే వాళ్లను తరచూ చూస్తుంటాం. కొందరు అటుకుల్లో అరటిపండు, రసగుల్లా, పాలు, పెరుగు వంటివి వేసి సరికొత్త ప్రయోగం చేస్తే.. ఇంకొందరు పచ్చి మిర్చితో హల్వా చేసి నెటిజన్ల కళ్లల్లో నీళ్లు తెప్పిస్తుంటారు. ఇలాంటి వంటకాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి వేపాకులతో వింత ప్రయోగం చేశాడు. ఇతడు చేసిన వంటకాన్ని చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి వేపాకులతో విచిత్ర వంటకాన్ని చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇందుకోసం ముందుగా వేప చెట్టు వద్దకు వెళ్లి చాలా వేపాకులను పీక్కుని వస్తాడు. తర్వాత వాటిని శుభ్రం చేసి, చిన్న చిన్న ముక్కలుగా కత్తిరిస్తాడు. తర్వాత అందులో ఉల్లి, వెల్లుల్లి మిర్చితో పాటూ మసాలాలను కలుపుతాడు. ఇలా వాటిని బాగా మిక్స్ చేసిన తర్వాత, సిద్ధంగా ఉంచుకున్న గోధుమ పిండి రేకుల్లో సమోసాల తరహాలో వేపాకు మిశ్రమాన్ని వేస్తాడు. తర్వాత ఆ పిండిని బాగా కలిపి, మళ్లీ దాన్ని పరోటా ఆకారంలో రోల్ చేసి వేడి చేస్తాడు.
Viral Video: బట్టలు ఉతుకుతున్న ప్పుడు కూడా అదే పనా.. వామ్మో..! ఈమె టెక్నిక్ మామూలుగా లేదుగా..
ఇలా చివరగా వేడి వేడి వేపాకు పరోటాను సిద్ధం చేస్తాడు. దాన్ని ముక్కలుగా కట్ చేసి, కస్టమర్లకు వడ్డిస్తాడు. ఈ విచిత్ర పరోటాను (neem paratha) తిన్న యువతి.. ‘‘తినడానికి చేదుగా ఉన్నా కూడా.. అందులో కలిపిన ఉల్లిపాయలు, టమోటా తదితర మిశ్రమం ఎంతో రుచిగా అనిపిస్తోంది’’.. అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ‘‘వేపాకులతో పరోటా ఏంట్రా నాయనా’’.. అంటూ కొందరు, ‘‘వేపాకులు ఆరోగ్యానికి మంచిది’’.. అంటూ ఇంకొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.
Viral Video: మొసలి, కొండచిలువ మధ్య భయంకర పోరాటం.. చివరకు ఇలా ఊహించని ట్విస్ట్..