Share News

Viral Video: బీచ్‌లో ఉన్నట్టుండి మాయమైన యువతి టవల్.. చివరకు కొండచిలువ నిర్వాకం తెలుసుకుని అంతా షాక్..

ABN , Publish Date - Jun 30 , 2024 | 07:21 PM

ఇళ్లల్లోకి ప్రవేశించే పాములు, కొండచిలువలు కొన్నిసార్లు చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తుంటాయి. ఎవరూ ఊహించని ప్రదేశాల్లో ప్రత్యక్షమవుతూ అందరినీ షాక్‌కు గురి చేస్తుంటాయి. మరికొన్నిసార్లు..

Viral Video: బీచ్‌లో ఉన్నట్టుండి మాయమైన యువతి టవల్.. చివరకు కొండచిలువ నిర్వాకం తెలుసుకుని అంతా షాక్..
ప్రతీకాత్మక చిత్రం

ఇళ్లల్లోకి ప్రవేశించే పాములు, కొండచిలువలు కొన్నిసార్లు చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తుంటాయి. ఎవరూ ఊహించని ప్రదేశాల్లో ప్రత్యక్షమవుతూ అందరినీ షాక్‌కు గురి చేస్తుంటాయి. మరికొన్నిసార్లు అంతటితో ఆగకుండా మనుషులు, జంతువులపై దాడులు కూడా చేస్తుంటాయి. అయితే ఇలాంటి సమయాల్లో ఇంకొన్నిసార్లు ఊహించని విచిత్ర ఘటనలు కూడా చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ కొండచిలువకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ యువతి బీచ్‌లో ఉండగా.. ఉన్నట్టుండి ఆమె టవల్ కనిపించకుండాపోయింది. చివరకు కొండచిలువ చేసిన నిర్వాకం తెలుసుకుని అంతా షాక్ అయ్యారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన ఆస్ట్రేలియాలో (Australia) చోటు చేసుకుంది. పాములు కొన్నిసార్లు ప్లాస్టిక్ పైపులు, ఇనుప వస్తువులు తదితరాలను మింగడం చూశాం. అయితే తాజాగా, కొండచిలువ చేసిన పని అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఓ చీచ్‌లో యువతికి సంబంధించిన టవల్ కనిపించలేదు. దీంతో ఆమె చుట్టు పక్కల వెతకగా వారికి షాకింగ్ సీన్ కనిపించింది.

Viral Video: ఇంట్లోకి దూరిన ఎలుగుబంటిని చూపుడువేలితో బెదిరించగా.. చివరకు అది చేసిన నిర్వాకం చూడండి..


ఓ కొండచిలువ టవల్‌ను మింగేసినట్లు (python swallowed towel) గుర్తించి అంతా షాక్ అయ్యారు. చివరకు సమాచారం అందుకున్న పశువైద్యులు.. కొండచిలువను ఆస్పత్రికి తీసుకెళ్లారు. దాని నోట్లోకి లైట్ అమర్చిన పైపును పంపించారు. చివరకు టవల్‌ను గుర్తించి, అతి కష్టం మీద దాన్ని కొంచెం కొంచెంగా బయటికి లాగారు. చివరకు దానికి ఎలాంటి గాయాలూ కాకుండా టవల్ మొత్తాన్ని బయటికి తీశారు. టవల్ బయటికి తీయగానే యువతి దాన్ని తీసుకుని.. హమ్మయ్య.. అంటూ ఊపిరిపీల్చుకుంది.

Viral video: జింకను తినేందుకు మొసలి జిమ్మిక్కు.. చివరకు ఏం జరిగిందో చూస్తే.. అవాక్కవుతారు..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అరే..! ఇదెక్కడి విచిత్రం.. కొండచిలువ టవల్ మింగడమేంటి’’.. అంటూ కొందరు, ‘‘కొండచిలువ ప్రాణాలను కాపాడారు’’.. అంటూ మరికొందరు, ‘‘ఈ వైద్యులు ఎంతో మంచి పని చేశారు’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 26 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral video: నాగుపాము సమీపానికి వెళ్లిన తాబేలు.. సడన్‌గా కోబ్రా కాటేయడంతో.. చివరకు..

Updated Date - Jun 30 , 2024 | 07:21 PM