Share News

Viral Video: పిల్ల పామే కదా అనుకుని నోట్లో పెట్టుకున్నాడు.. చివరకు ఏం జరిగిందో చూస్తే..

ABN , Publish Date - Jul 02 , 2024 | 05:51 PM

పాములు చాలా ప్రమాదమని తెలిసినా చాలా మంది వాటితో పిల్ల చేష్టలు చేస్తుంటారు. కొందరైతే మరీ దారుణంగా ప్రవర్తిస్తుంటారు. ఇంకొందరు ఓ అడుగు ముందుకేసి పాములను మెడలో వేసుకోవడం..

Viral Video: పిల్ల పామే కదా అనుకుని నోట్లో పెట్టుకున్నాడు.. చివరకు ఏం జరిగిందో చూస్తే..

పాములు చాలా ప్రమాదమని తెలిసినా చాలా మంది వాటితో పిల్ల చేష్టలు చేస్తుంటారు. కొందరైతే మరీ దారుణంగా ప్రవర్తిస్తుంటారు. ఇంకొందరు ఓ అడుగు ముందుకేసి పాములను మెడలో వేసుకోవడం, నోటిలో పెట్టుకోవడం, ముద్దులు పెట్టడం చేస్తుంటారు. ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు ఊహించని ఘటనలు జరుగుతుంటాయి. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి పిల్ల పామే కదా అని ఏకంగా దాన్ని నోట్లో పెట్టుకున్నాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడు అడవిలో పర్యటిస్తుండగా.. అతడికి పచ్చటి రంగులో సన్నని తీగలాగా ఉన్న పాము కనిపిస్తుంది. దాన్ని చేతిలోకి తీసుకున్న (man put the snake in his mouth) అతను నోటిలో పెట్టుకుంటాడు. దీంతో ఆ పాము చివరకు అతడి ముఖంపై (snake bite young man Face) గట్టిగా కాటేస్తుంది. ఇలా చాలా సేపు ముఖాన్ని గట్టిగా పట్టేసుకుంటుంది. దీంతో అతను ఏమాత్రం భయపడకుండా మళ్లీ పామున నోట్లో పెట్టుకుని సుతిమెత్తగా కొరకడానికి ప్రయత్నిస్తాడు.

Viral Video: కనీవినీ ఎరుగని వంటకం.. వేపాకులతో ఇతడు చేసిన ప్రయోగం చూస్తే..


ఇలా చాలా సేపు అతడు పాముతో ఆడుకుంటాడు. అయితే ఆ పాము విషపూరితం కాకపోవడంతో అతడికి ఎలాంటి ప్రాణహానీ కలగనట్లు తెలుస్తోంది. కాగా, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి పిచ్చి పనులు చేయడం ప్రమాదకరం’’.. అంటూ కొందరు, ‘‘విషపూరితమైన పాములైతే ప్రాణాలకే ప్రమాదం’’.. అంటూ మరికొందరు, ‘‘ఇలాంటి పనులు ఎవరూ చేయొద్దు’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తు్న్నారు. ఈ వీడియో ప్రస్తుతం 25 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: బట్టలు ఉతుకుతున్నప్పుడు కూడా అదే పనా.. వామ్మో..! ఈమె టెక్నిక్ మామూలుగా లేదుగా..

Updated Date - Jul 02 , 2024 | 05:51 PM