Share News

Viral: ముక్కులో ఊపిరాడక వైద్యుడి వద్దకు వెళ్లిన రోగి.. పరీక్షించి చూడగా.. చివరికి షాకింగ్ సీన్..

ABN , Publish Date - Jun 30 , 2024 | 08:53 PM

వివిధ రకాల సమస్యలతో ఆస్పత్రికి వచ్చే రోగులకు పరీక్షలు చేసే క్రమంలో షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లే వారిని స్కానింగ్ చేస్తే.. లోపల..

Viral: ముక్కులో ఊపిరాడక వైద్యుడి వద్దకు వెళ్లిన రోగి.. పరీక్షించి చూడగా.. చివరికి షాకింగ్ సీన్..

వివిధ రకాల సమస్యలతో ఆస్పత్రికి వచ్చే రోగులకు పరీక్షలు చేసే క్రమంలో షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లే వారిని స్కానింగ్ చేస్తే.. లోపల ఇనుప వస్తువులు, వెంట్రుకలు తదితరాలు కనిపిస్తుంటాయి. అలాగే చెవి నొప్పితో వచ్చిన వారిని పరీక్షించగా.. లోపల ఏకంగా పాములే కనిపిస్తుంటాయి. ఇలాటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వార్త ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ముక్కులో ఊపిరాడక ఆస్పత్రికి వెళ్లిన రోగిని వైద్యులు పరీక్షించారు. చివరకు లోపల వారికి షాకింగ్ దృశ్యం కనిపించింది.


సోషల్ మీడియాలో ఓ వార్త (Viral News) తెగ వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) ప్రయాగ్‌రాజ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉత్తారాఖండ్ ప్రాంతానికి చెందిన సెసిల్ ఆండ్రూ అనే 19 ఏళ్ల యువకుడు ఇటీవల ఓ రోజు స్నేహితులతో కలిసి విహారయాత్ర వెళ్లాడు. ఈ క్రమంలో ప్రయాగ్‌రాజ్‌లోని జలపాతం వద్దకు వెళ్లాడు. ఈ సందర్భంగా అక్కడ ఈత కొడుతూ ఎంజాయ్ చేశాడు. అయితే ఈ సమయంలో ఉన్నట్టుండి అతడి ముక్కులో ఊపిరాడక ఇబ్బందిపడ్డాడు.

Viral: ఒకే ఇంట్లో మూడోసారి చోరీకి వెళ్లిన దొంగ.. బెడ్రూంలో దంపతులను నగ్నంగా చూసి.. చివరకు..


చివరకు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వెళ్లాడు. వైద్యులు అతన్ని పరీక్షించి చూడగా.. అతడి ముక్కు ఎడమ రంధ్రంలో (Leech in the nose) ఓ జలగ కనిపించింది. అది కూడా సజీవంగా ఉండడం చూసి వారంతా షాక్ అయ్యారు. చివరకు వైద్యులంతా కలిసి టెలిస్కోపిక్ పద్ధతిలో అతడి ముక్కుకు సర్జరీ (Surgery) చేసి, జలగను బయటికి తీశారు. సాధారణంగా జలపాతాల వద్ద స్నానాలు చేసే సమయంలో శరీరంపై జలగలు కనిపించడం సాధారణంగా జరుగుతుంటుందని వైద్యులు తెలిపారు.

Viral Video: బీచ్‌లో ఉన్నట్టుండి మాయమైన యువతి టవల్.. చివరకు కొండచిలువ నిర్వాకం తెలుసుకుని అంతా షాక్..


Uttar-Pradesh-Viral-News.jpg

అయితే జలగ ఇలా ముక్కులోకి వెళ్లడం విచిత్రంగా ఉందన్నారు. ప్రస్తుతం యువకుడి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. కాగా, ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో ఇదేంటీ మరీ విచిత్రంగా ఉందే’’.. అంటూ కొందరు, ‘‘ఇతడి టైం బాగుంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral video: నాగుపాము సమీపానికి వెళ్లిన తాబేలు.. సడన్‌గా కోబ్రా కాటేయడంతో.. చివరకు..

Updated Date - Jun 30 , 2024 | 08:53 PM