Share News

Viral video: ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆవు చేసిన పని చూస్తే.. అవాక్కవ్వాల్సిందే..

ABN , Publish Date - Jun 27 , 2024 | 09:33 PM

రోజురోజుకూ చాలా మంది మనుషులు జంతువులుగా మారుతుంటే.. అదే సమయంలో చాలా జంతువులు మనుషులు చేయాల్సిన పనులను గుర్తు చేస్తూ కనువిప్పు కలిగిస్తుంటాయి. కొన్నిసార్లు..

Viral video: ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆవు చేసిన పని చూస్తే.. అవాక్కవ్వాల్సిందే..

రోజురోజుకూ చాలా మంది మనుషులు జంతువులుగా మారుతుంటే.. అదే సమయంలో చాలా జంతువులు మనుషులు చేయాల్సిన పనులను గుర్తు చేస్తూ కనువిప్పు కలిగిస్తుంటాయి. కొన్నిసార్లు పులి నీళ్లలో పడిపోయిన ప్లాస్టిక్ బాటిల్‌ను తొలగించి బాధ్యతలను గుర్తు చేస్తే.. మరికొన్నిసార్లు ఓ జంతువు తోటి జంతువుకు సాయం చేస్తూ మనుషులకు మానవత్వాన్ని గుర్తు చేస్తుంటాయి. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ ఆవు వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఓ ఆవు చేసిన పని చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో పూణే పోలీసులు (Pune Police) షేర్ చేసిన ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. చాలా మంది వాహనాదారులు ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద నిర్లక్ష్యంగా వ్యవహరించడం చూస్తుంటాం. కొందరు ఇష్టమొచ్చినట్లు సిగ్నల్ జంపింగ్ చేస్తుంటే.. మరికొందరు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఎదుటి వారిని కూడా ప్రమాదంలో పడేస్తుంటారు. ఇలాంటి వారికి కనువిప్పు కలిగించేలా ఓ ఆవు ప్రవర్తించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

Puzzle: ఈ క్లాస్‌రూంలో పడిపోయిన.. టీచర్ కళ్లద్దాలను కనిపెట్టండి చూద్దాం..


ఓ ట్రాఫిక్ సిగ్నల్ (Traffic signal) వద్ద రెడ్ లైట్ పడగానే వాహనాలన్నీ ఆగిపోతాయి. అయితే వాటిలో కొందరు బైకర్లు, ఆటోలు జీబ్రా లైన్లు దాటి ముందుకు వెళ్లి ఆగిపోతాయి. అదే అసమయంలో అటుగా వచ్చిన ఓ ఆవు (cow) సిగ్నల్ వద్ద వాహనాలతో పాటూ ఆగడమే కాకుండా... నిబంధనలను పాటిస్తున్నట్లుగా జీబ్రా లైన్లకు అవతలి వైపే నిలబడి ఉంటుంది. ఈ ఆవును చూసి అక్కడున్న వారంతా అవాక్కయ్యారు.

Woman: ‘‘నేను శివుడు, నువ్వు పార్వతి’’.. మహిళకు వింత కథ చెప్పిన మరో మహిళ.. చివరకు..


వెంటనే ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వావ్..! ఈ ఆవును చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది’’.. అంటూ కొందరు, ‘‘ఈ ఆవును చూసి మనుషులు ఎంతో నేర్చుకోవాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వెయ్యికి పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral video: వామ్మో..! పాకిస్థాన్‌లో ఇలా చేస్తారా.. కదులుతున్న రైలుపై ఆకతాయిలు నీళ్లు చల్లడంతో చివరకు ..

Updated Date - Jun 27 , 2024 | 09:33 PM