Viral video: ఆశ్చర్యపరుస్తున్న కోతి.. పిల్లి వద్దకు వెళ్లి అది చేసిన పని చూస్తే.. అవాక్కవ్వాల్సిందే..
ABN , Publish Date - Jun 28 , 2024 | 07:56 PM
పిల్లులు, కుక్కలు, కోతులు చిత్రవిచిత్రంగా ప్రవర్తించడం చూస్తుంటాం. అయితే కొన్నిసార్లు అవి చేసే పనులు చూస్తే మనుషులు కూడా ఆశ్చర్యయేలా ఉంటాయి. మరికొన్నిసార్లు మనుషులంతా తమను చూసి...
పిల్లులు, కుక్కలు, కోతులు చిత్రవిచిత్రంగా ప్రవర్తించడం చూస్తుంటాం. అయితే కొన్నిసార్లు అవి చేసే పనులు చూస్తే మనుషులు కూడా ఆశ్చర్యయేలా ఉంటాయి. మరికొన్నిసార్లు మనుషులంతా తమను చూసి నేర్చుకునేలా గుణపాఠం నేర్పిస్తుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు తరచూ చూస్తుంటాం. తాజాగా, ఓ కోతికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ కోతి నిర్వాకం చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తు్నారు. పిల్లి వద్దకు వెళ్లి అది చేసిన పని చూసి.. అంతా అవాక్కవుతున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ పిల్లి రోడ్డుపై ఒకే చోట నిలబడి ఏదో దిగులుగా ఆలోచిస్తున్నట్లుగా కనిపిస్తుంది. చాలా సేపు పిల్లి అక్కడే ఉండడాన్ని ఓ కోతి గమనిస్తుంది. వెంటనే సమీపానికి వెళ్లి ప్రేమగా పలకరిస్తుంది. ‘‘ఏమైందబ్బా బుజ్జీ.. ఎందుకలా దిగులుగా ఉన్నావ్.. నీకు నేనున్నాగా.. చెప్పు.. చెప్పు ఏమైందీ’’.. అన్నట్లుగా పిల్లిని ఎంతో ప్రేమగా లాలిస్తుంది.
Viral video: వర్షంలో డాన్స్ చేస్తూ వైరల్ అవ్వాలనుకుంది.. మొదట్లోనే ఇలా జరుగుతుందని ఊహించలేకపోయింది..
తల్లి తన పిల్లలను ఎలాగైస్తూ పిలుస్తూ నవ్విస్తుందో.. అచ్చం ఈ కోతి కూడా పిల్లిని అలాగే లాలిస్తుంది. మధ్య మధ్యలో పిల్లి మూతి మీద ఉన్న మీసాలను పట్టుకుని సరదాగా ఆడుకుంటుంది. ‘‘బుజ్జి.. కన్నా’’.. అని పిలుస్తున్నట్లుగా ఎక్స్‌ప్రెషన్ ఇస్తూ (monkey lovingly kissing cat) పిల్లికి ముద్దులు పెడుతుంది. దీంతో చివరకు పిల్లికి బాధ పోయి.. కోతితో కలిసిపోతుంది. తన తల్లి వద్ద ఎలా పడుకుంటుందో.. అలాగే కోతి ఒడిలోకి దూరిపోతుంది. దీంతో కోతి ఆ పిల్లిని ఒడిలో పెట్టుకుని లాలిస్తుంది.
Viral video: మృతదేహాన్ని పక్కన పెట్టుకుని వీళ్లు చేస్తున్న పని చూస్తే.. నోరెళ్లబెడతారు..
ఈ దృశ్యం చూసేందుకు మనసుకు హత్తుకునేలా ఉంటుంది. ఈ ఘటనను చూసి అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ కోతి, పిల్లిని చూస్తుంటే ఎంతో ముచ్చటగా ఉంది’’.. అంటూ కొందరు, ‘‘తల్లి ప్రేమ ఎలా ఉండాలో ఈ కోతిని చూస్తే తెలిసిపోతుంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 8 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.