Viral: గొంతులో దురదతో ఆస్పత్రికి వెళ్లగా.. పరీక్షించిన వైద్యులు షాక్.. చివరకు కారణమేంటని విచారించగా..
ABN , Publish Date - Jun 28 , 2024 | 05:21 PM
ఒక సమస్యతో ఆస్పత్రికి వెళ్తే.. చివరకు పరీక్షల్లో షాకింగ్ రిజల్ట్స్ కనిపించడం అప్పుడప్పుడూ జరుగుతుంటుంది. మరికొన్నిసార్ల రోగుల శరీరంలో వింత వింత వస్తువులు బయటపడుతుంటాయి. ఇంకొన్నిసార్లు...
ఒక సమస్యతో ఆస్పత్రికి వెళ్తే.. చివరకు పరీక్షల్లో షాకింగ్ రిజల్ట్స్ కనిపించడం అప్పుడప్పుడూ జరుగుతుంటుంది. మరికొన్నిసార్ల రోగుల శరీరంలో వింత వింత వస్తువులు బయటపడుతుంటాయి. ఇంకొన్నిసార్లు అనేక రకాల జీవులు కూడా కనిపిస్తుంటాయి. ఇలాంటి వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాగాజా ఇలాంటి వార్త ఒకటి తెగ వైలర్ అవుతోంది. ఓ వ్యక్తి గొంతులో దురదతో ఆస్పత్రికి వెళ్లాడు. అయితే పరీక్షించిన వైద్యులు లోపలి దృశ్యం చూసి షాక్ అయ్యారు. చివరకు దానికి గల అసలు కారణం తెలుసుకుని అంత నోరెళ్లబెట్టారు. వివరాల్లోకి వెళితే..
సోషల్ మీడియాలో ఓ వార్త (Viral News) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన ఆస్ట్రియాలో (Austria) చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన 52 ఏళ్ల వ్యక్తికి గొంత నొప్పి, దురద మొదలైంది. అయినా మొదట పట్టించుకోలేదు. అయితే కొన్నాళ్లకు గొంతు బొంగురుపోవడంతో పాటూ శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బంది తలెత్తింది. దీంతో భయపడి చివరకు వైద్యుడిని సంప్రదించాడు. పరీక్షించిన వైద్యులు అతడి గొంతులో (hair growing inside throat) జుట్టు పెరుగుతున్నట్లు చూసి షాక్ అయ్యారు. గొంతులో జుట్టు పెరగడం ఏంటని మొదటి అంతా అవాక్కయ్యారు. చివరకు అతడికి రెండేళ్ల పాటు చికిత్స అందించాల్సి వచ్చింది.
Viral video: ఎంత ట్రాఫిక్ జామ్ అయితే మాత్రం... ఇలా ఎవరైనా చేస్తారా.. ఈ బైకర్‌ను చూసి అంతా షాక్..
ధూమపానం చేయడం వల్ల ఇలాంటి సమస్య తలెత్తినట్లు వైద్యులు తెలిపారు. దీనికి ‘‘ఎండోట్రాషియల్ హెయిర్ గ్రోత్’’ అని పేరు పెట్టారు. ధూమపానం (smoking) చేసే వారిలో ఇలా చాలా అరుదుగా జరుగుతుంటుందని చెప్పారు. ఈ వెంట్రుకలు 6 నుంచి 9 అంగుళాల వరకూ పెరిగే అవకాశం ఉందన్నారు. సదరు రోగి 20 సంవత్సరాల వయసు నుంచి సిగరెట్ తాగుతున్నట్లు తెలిసింది. స్మోకింగ్ కారణంగా గొంతులో ఇలా వెంట్రుకలు పెరగడం ఇదే తొలిసారి అని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాగా, ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
Viral video: మృతదేహాన్ని పక్కన పెట్టుకుని వీళ్లు చేస్తున్న పని చూస్తే.. నోరెళ్లబెడతారు..