Share News

Viral video: చూసేందుకే పిల్లి.. దీని మంచితనం మామూలుగా లేదుగా..

ABN , Publish Date - Jun 28 , 2024 | 09:29 PM

కుక్కల తరహాలోనే పిల్లులు కూడా కొన్నిసార్లు చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తుంటాయి. మరికొన్నిసార్లు తోటి జంతువులతో స్నేహం చేస్తూ అంతా అవాక్కయ్యేలా చేస్తుంటాయి. ఇంకొన్నిసార్లు మనుషుల తరహాలోనే ..

Viral video: చూసేందుకే పిల్లి.. దీని మంచితనం మామూలుగా లేదుగా..

కుక్కల తరహాలోనే పిల్లులు కూడా కొన్నిసార్లు చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తుంటాయి. మరికొన్నిసార్లు తోటి జంతువులతో స్నేహం చేస్తూ అంతా అవాక్కయ్యేలా చేస్తుంటాయి. ఇంకొన్నిసార్లు మనుషుల తరహాలోనే సాయం చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ పిల్లి తాబేలు పట్ల చూపిన ప్రేమ చూసి అంతా అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ తాబేలు తలకిందులుగా (Tortoise fell upside down) పడిపోయి తిరిగి మామూలు స్థితికి వచ్చేందుకు శతవిధాలా ప్రయత్నిస్తుంటుంది. అయినా సాధ్యం కాకపోవడంతో అలాగే కొట్టుమిట్టాడుతోంది. ఈ క్రమంలో అటుగా వెళ్తున్న పిల్లి దాన్ని గమనిస్తుంది. తలికిందులుగా కొట్టుమిట్టాడుతున్న తాబేలును చూసిన పిల్లి.. ముందు భయపడిపోతుంది. తర్వాత దగ్గరికి వెళ్లి నిశితంతా పరిశీలిస్తుంది. చివరకు తాబేలు సమస్యను అర్థం చేసుకుని, దాన్ని కాలు పట్టుకుని తిప్పి మామూలు స్థితికి తెస్తుంది.

Viral video: మృతదేహాన్ని పక్కన పెట్టుకుని వీళ్లు చేస్తున్న పని చూస్తే.. నోరెళ్లబెడతారు..


ఇలా తాబేలు కష్టాన్ని గుర్తించిన పిల్లి.. తనలో కూడా (cat helped the turtle) మంచితనం మిగిలి ఉందని నిరూపించింది. ఈ సీన్ చూస్తుంటే.. పిల్లిలోని మంచితనం బయటపెట్టేందుకు దాని యజమాని ఇలా పరీక్ష పెట్టాడని తెలుస్తోంది. ఏది ఏమైనా కష్టాల్లో ఉన్న తాబేలును చూసి వెంటనే సాయం చేసిన పిల్లి.. నెటిజన్లు తెగ ఆకట్టుకుంటోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ పిల్లి మనసు ఎంతో గొప్పది’’.. అంటూ కొందరు, ‘‘ఈ పిల్లిని చూసి మనుషులు ఎంతో నేర్చుకోవాల్సి ఉంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral video: దూడకు జన్మనిచ్చిన గేదె.. పోలీసులకు ఫోన్ చేసిన వ్యక్తి.. ట్విస్ట్ ఏంటో తెలిస్తే.. నవ్వు ఆపుకోలేరు..

Updated Date - Jun 28 , 2024 | 09:42 PM