Share News

Viral video: నీళ్లలో రోడ్ డివైడర్స్.. సమీపానికి వెళ్లి చూస్తే ఒళ్లు గగుర్పొడిచే సీన్..

ABN , Publish Date - Jun 29 , 2024 | 03:09 PM

ఈ సృష్టిలో ఇప్పటికీ మానవాళికి తెలీని ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. అప్పుడప్పుడూ అలాంటివన్నీ ఒక్కొక్కటిగా బయటపెడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. అలాగే మరికొన్నిసార్లు..

Viral video: నీళ్లలో రోడ్ డివైడర్స్.. సమీపానికి వెళ్లి చూస్తే ఒళ్లు గగుర్పొడిచే సీన్..

ఈ సృష్టిలో ఇప్పటికీ మానవాళికి తెలీని ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. అప్పుడప్పుడూ అలాంటివన్నీ ఒక్కొక్కటిగా బయటపెడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. అలాగే మరికొన్నిసార్లు వింత వింత జీవులు విచిత్ర ఆకారాల్లో కనిపిస్తుంటాయి. ఇలాంటి చిత్రవిచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. నీళ్లలో రోడ్ డివైడర్స్ ఉండడంతో అంతా షాక్ అయ్యారు. చివరకు సమీపానికి వెళ్లి చూడగా షాకింగ్ సీన్ కనిపించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘‘వామ్మో.. ఇదేంట్రా బాబోయ్’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ నది ఒడ్డున నీటిలో రోడ్డు మధ్యలో ఏర్పాటు చేసే డివైడర్స్ (Road dividers) కనిపించాయి. దూరం నుంచి చూడగా.. అచ్చం రోడ్ డివైడర్స్‌లా ఉండడంతో నీటిలో ఇలా ఎందుకు ఏర్పాటు చేశారని చాలా మందికి అనిపించింది. అయితే సమీపానికి వెళ్లి చూడగా.. దిమ్మతిరిగే సీన్ కనిపించింది. అవి రోడ్ డివైడర్స్ కాదని.. పొడవాటి రెండు పాములని తెలిసింది. ఆ పాములు చూసేందుకు నలుపు, పసుపు రంగులో అచ్చం రోడ్ డివైడర్స్‌ లాగానే ఉన్నాయి.

Viral video: నీటి గుర్రం పవరేంటో ఎప్పుడైనా చూశారా.. మూడు సింహాలను సైతం ఒక్కసారిగా..


అందులోనూ గుండ్రంగా ఉండాల్సిన పాములు కాస్త.. త్రికోణం ఆకారంలో కనిపిస్తున్నాయి. రెండు పాములూ కలిసి పాకుతూ వెళ్లడం చూసి అంతా అవాక్కయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు కూడా షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఈ పాములను బ్యాండెడ్ క్రైట్ (Banded krait snakes) అని పిలుస్తారు... ఇవి అత్యంత విషపూరితమైన పాములు’’.. అంటూ కొందరు, ‘‘నదిలో స్పీడ్ బ్రేకర్స్ కోసం ఇలా వచ్చాయేమో’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 62 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral video: దూడకు జన్మనిచ్చిన గేదె.. పోలీసులకు ఫోన్ చేసిన వ్యక్తి.. ట్విస్ట్ ఏంటో తెలిస్తే.. నవ్వు ఆపుకోలేరు..

Updated Date - Jun 29 , 2024 | 03:09 PM