Share News

Viral Video: ఇదేం ఐడియారా బాబూ..! స్కూటీని ఏకంగా బాత్రూంగా మార్చేశాడుగా..

ABN , Publish Date - Jul 03 , 2024 | 04:08 PM

వాహనాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. కొందరు పాత వాహనాలను వింత వింత డిజైన్లతో సరికొత్తగా మారుస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. మరికొందరు..

Viral Video: ఇదేం ఐడియారా బాబూ..! స్కూటీని ఏకంగా బాత్రూంగా మార్చేశాడుగా..

వాహనాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. కొందరు పాత వాహనాలను వింత వింత డిజైన్లతో సరికొత్తగా మారుస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. మరికొందరు వింత వింత విడి భాగాలను అమర్చుతూ అంతా అవాక్కయ్యేలా చేస్తుంటారు. ఇలాంటి విచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు తరచూ దర్శనమిస్తుంటాయి. తాజాగా, ఓ వ్యక్తి స్కూటీని ఏకంగా బాత్రూంగా మార్చడం చూసి అంతా షాక్ అవుతున్నారు. ఈ వీడియోను చూసిన వారంతా.. ‘‘ఇదేం ఐడియారా బాబూ’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి స్కూటీని వినూత్నంగా మార్చడం చూసి అంతా అవాక్కవుతున్నారు. స్కూటీ సీటును తీసేసిన అతను.. దాని స్థానంలో (bathroom commode installed on scooty) బాత్రూం మోడ్రన్ కమోడ్‌ను అమర్చాడు. కేవలం కమోడ్ ఆకారం అనుకుంటే పొరపాటే.. నిజమైన కమోడ్‌లో ఎలాగైతా నీళ్లు వదులుతారో.. ఇందులో కూడా నీళ్లను వదిలేలా ఏర్పాట్లు చేస్తున్నారు. స్కూటీ హ్యాండిల్‌ యాక్సిలరేటర్ తిప్పగానే కమోడ్‌లోకి నీళ్లు వచ్చేలా ఏర్పాట్లు చేశాడు.

Viral Video: నీళ్లు తాగడానికి వచ్చిన ఏనుగు.. అక్కడే మాటేసిన సింహం.. చివరకు చూస్తే..


ఫైనల్‌గా స్కూటీ కమోడ్‌పై కూర్చుని రోడ్డుపై రయ్యిన దూసుకుపోతున్నాడు. ఈ వింత వాహనాన్ని చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఎలా వస్తాయిరా.. ఇలాంటి ఐడియాలు’’.. అంటూ కొందరు, ‘‘ఒకే సమయంలో రెండు పనుల కోసమేమో’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 25 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: మొసలి, కొండచిలువ మధ్య భయంకర పోరాటం.. చివరకు ఎవరూ ఊహించని ట్విస్ట్..

Updated Date - Jul 03 , 2024 | 04:08 PM