Share News

Viral Video: నీళ్లు తాగడానికి వచ్చిన ఏనుగు.. అక్కడే మాటేసిన సింహం.. చివరకు చూస్తే..

ABN , Publish Date - Jul 02 , 2024 | 08:48 PM

అడవికి రాజు సింహం అయితే.. సింహాన్ని కూడా భయపట్టే జంతువులు చాలా ఉంటాయి. వాటిలో ఏనుగులు ముందు వరుసలో ఉంటాయి. ఏనుగులు వస్తున్నాయంటే పులులు, సింహాలు భయంతో పక్కకు పారిపోతుంటాయి. కొన్నిసార్లు..

Viral Video: నీళ్లు తాగడానికి వచ్చిన ఏనుగు.. అక్కడే మాటేసిన సింహం.. చివరకు చూస్తే..

అడవికి రాజు సింహం అయితే.. సింహాన్ని కూడా భయపట్టే జంతువులు చాలా ఉంటాయి. వాటిలో ఏనుగులు ముందు వరుసలో ఉంటాయి. ఏనుగులు వస్తున్నాయంటే పులులు, సింహాలు భయంతో పక్కకు పారిపోతుంటాయి. కొన్నిసార్లు వాటితో తలపడాలని చూసినా చివరకు తోక ముడిచే పరిస్థితులే ఎదురవుతుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఏనుగు నీళ్లు తాగడానికి వస్తుండడం చూసి ఓ సింహం అక్కడే మాటేసింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ సింహం వేట కోసం నీళ్ల తొట్టి వద్ద వేచి చూస్తుంటుంది. నీళ్లు తాగడానికి ఏం జంతువైనా వస్తే.. వెంటనే దాడి చేయాలని కాపు కాసి ఉంటుంది. అయితే కాసేపటికి అక్కడికి ఓ ఏనుగు వస్తుంది. నీళ్ల తొట్టి వద్దకు ఏనుగు రావడం చూసి సింహం పైకి లేచి భయం భయంగానే చాటుగా నిలబడుతుంది. తొట్టి వద్దకు వచ్చిన ఏనుగు సింహాన్ని చూసి ముందు కాస్త వెనకడుగు వేస్తుంది.

Viral Video: కనీవినీ ఎరుగని వంటకం.. వేపాకులతో ఇతడు చేసిన ప్రయోగం చూస్తే..


తర్వాత దాన్ని సున్నితంగా హెచ్చరిస్తున్నట్లుగా తొండాన్ని అటూ ఇటూ ఊపుతుంది. అయినా సింహం ఎటూ కదలకుండా దాని వైపే చూస్తూ గాండ్రిస్తుంది. తొట్టిలో తొండాన్ని ముంచి నీళ్లు తాగుతున్న ఏనుగును.. సింహం అక్కడే నిలబడి చూస్తూ భయపెట్టాలని చూస్తుంది. ఇలా చాలా సేపు ఓపిగ్గా చూసిన ఏనుగుకు.. ఉన్నట్టుండి కోపం కట్టలు తెంచుకుంటుంది. ‘‘ఎంత హెచ్చరిస్తున్నా కదలకుండా ఇక్కడే ఉంటావా.. ఉండు నీ పని చెబుతా’’.. అన్నట్లుగా (elephant chasing lion) వేగంగా దాని వైపు కదులుతుంది. దీంతో అప్పటిదాకా గాండ్రించిన సింహం కాస్తా.. భయంతో అక్కడి నుంచి పారిపోతుంది.

Viral Video: మొసలి, కొండచిలువ మధ్య భయంకర పోరాటం.. చివరకు ఎవరూ ఊహించని ట్విస్ట్..


అయినా వదలకుండా కొంత దూరం వరకు దాన్ని వెంబడిస్తుంది. సింహం కనిపించికుండా పోయేసరికి తర్వాత వెనక్కు వచ్చేస్తుంది. ఈ ఘటనను మొత్తం అక్కడే ఉన్న పర్యాటకులు తమ కెమెరాల్లో బంధించారు. చాలా కాలం క్రితం చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఏనుగుతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది మరి’’.. అంటూ కొందరు, ‘‘సింహానికి చుక్కలు చూపించిన ఏనుగు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 13 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: బట్టలు ఉతుకుతున్నప్పుడు కూడా అదే పనా.. వామ్మో..! ఈమె టెక్నిక్ మామూలుగా లేదుగా..

Updated Date - Jul 02 , 2024 | 08:48 PM