Share News

Viral Video: నీటి మీదుగా వెళ్తున్న పక్షి.. గాల్లోకి లేచిన చేప.. చివరకు షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే..

ABN , Publish Date - Jul 02 , 2024 | 09:49 PM

పక్షులు, చేపలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. పక్షులు, చేపల వేటకు సంబంధించిన వీడియోలు కూడా చాలా చూశాం. అయితే కొన్నిసార్లు..

Viral Video: నీటి మీదుగా వెళ్తున్న పక్షి.. గాల్లోకి లేచిన చేప.. చివరకు షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే..

పక్షులు, చేపలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. పక్షులు, చేపల వేటకు సంబంధించిన వీడియోలు కూడా చాలా చూశాం. అయితే కొన్నిసార్లు వీటి మధ్య చిత్రవిచిత్ర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ పక్షి నీటి మీదుగా వెళ్తోంది. అదే సమయంలో ఓ చేప గాల్లోకి లేచింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ పక్షి నీటి మీదుగా ఎగురుకుంటూ వెళ్తుంటుంది. ఏవైనా చిన్న చిన్న చేపలు కనిపిస్తే తినేయాలని చూస్తూ ఉంటుంది. అయితే ఇంతలో ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. సరిగ్గా అదే సమయంలో ఓ చేప నీటిలో నుంచి గాల్లోకి లేస్తుంది. క్షణాల్లో పక్షిని నోట (fish hunted a bird) కరుచుకుని నీటిలోకి లాక్కెళ్తుంది. సాధారణంగా పక్షులు చేపలను వేటాడుతుంటాయి.

Viral Video: నీళ్లు తాగడానికి వచ్చిన ఏనుగు.. అక్కడే మాటేసిన సింహం.. చివరకు చూస్తే..


అయితే పక్షిని వేటాడే చేపలను చాలా అరుదుగా చూస్తుంటాం. దీంతో ఈ చేపను చూడగానే అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ చేప వేట మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి చేపలను ఎప్పుడూ చూడలేదు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 5లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: పెళ్లి వేదికపై వధూవరులు.. సడన్‌గా సమీపానికి వచ్చిన కుక్క.. చివరకు..

Updated Date - Jul 02 , 2024 | 09:49 PM