Share News

Viral Video: ఐస్‌క్రీం అమ్ముతూనే కారు యజమానిపై కన్నేసిన మహిళ.. చివరకు బాలికను ఎలా కాపాడిందంటే..

ABN , Publish Date - Jul 03 , 2024 | 05:51 PM

ఇంటి నుంచి బయటికి వెళ్లే మహిళ.. తిరిగి క్షేమంగా ఇంటికి వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. మహిళ ఒంటరిగా కనిపిస్తే చాలు.. వారిని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని చూస్తుంటారు. కొందరైతే..

Viral Video: ఐస్‌క్రీం అమ్ముతూనే కారు యజమానిపై కన్నేసిన మహిళ.. చివరకు బాలికను ఎలా కాపాడిందంటే..

ఇంటి నుంచి బయటికి వెళ్లే మహిళ.. తిరిగి క్షేమంగా ఇంటికి వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. మహిళ ఒంటరిగా కనిపిస్తే చాలు.. వారిని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని చూస్తుంటారు. కొందరైతే మరీ దారుణంగా ప్రవర్తిస్తుంటారు. ఇంకొందరు కిడ్నాప్ చేసి మరీ తమ శాడిజాన్ని ప్రదర్శిస్తుంటారు. అయితే కొన్నిసార్లు ఇలాంటి ప్రమాదాల్లో చిక్కుకున్న వారు క్షేమంగా బయటపడుతుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి తెగ చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ ఐస్‌క్రీం అమ్ముతూనే.. కారు యజమానిపై కన్నేసింది. చివరకు బాలికను ఎలా కాపాడిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ బాలిక (girl) ఐస్‌క్రీం కొనేందుకు రోడ్డు పక్కన ఉన్న దుకాణానికి వస్తుంది. బాలికకు కావాల్సిన ఐస్‌క్రీంను (ice cream) తీసుకురావడానికి సదరు మహిళ లోపలికి వెళ్తుంది. అదే సమయంలో అటు పక్కనే ఓ వ్యక్తి.. కారును రోడ్డు పక్కగా ఆపుకొని ఫోన్‌లో మాట్లాడుతూ బాలికను గమనిస్తుంటాడు. బాలిక వెళ్లే సమయంలో కారులో (Kidnapping attempt) కిడ్నాప్ చేయాలని ఎదురు చూస్తుంటాడు.

Viral Video: మొసలి, కొండచిలువ మధ్య భయంకర పోరాటం.. చివరకు ఎవరూ ఊహించని ట్విస్ట్..


అయితే బాలికకు ఐస్ క్రీం ఇచ్చిన మహిళ (woman) .. పక్కనే ఉన్న వ్యక్తిని గమనిస్తుంది. అతడి ప్రవర్తన అనుమానాస్పందంగా ఉండడంతో ఆమెకు విషయం అర్థమవుతుంది. ఐస్‌క్రీం తీసుకున్న బాలిక ఇంటికి బయలుదేరుతుంది. దీన్ని గమనించిన ఆ వ్యక్తి కూడా కారు సమీపానికి వస్తాడు. బాలిక కారు డోరు వద్దకు రాగానే బలవంతంగా లోపలికి తోసేయాలని చూస్తుంటాడు. ఇది చూసిన దుకాణ యజమానురాలు.. వెంటనే బాలిక వద్దకు వెళ్తుంది. ఆమె భుజంపై చేయి వేసి తీసుకెళ్తుంది.

Viral Video: ఇదేం ఐడియారా బాబూ..! స్కూటీని ఏకంగా బాత్రూంగా మార్చేశాడుగా..


తన ప్లాన్ బెడిసికొట్టడంతో చివరకు కారు యజమాని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అయితే ఈ ఘటన మొత్తాన్ని గమనిస్తే.. ఇదంతా మెసేజ్ ఇవ్వడానికి కావాలని చేసినట్లుగా ఉన్నా కూడా.. వీడియో మాత్రం తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి వాళ్లు మన చుట్టూ చాలా మంది ఉంటారు’’.. అంటూ కొందరు, ‘‘ఈ మహిళ చాలా గొప్ప పని చేసింది’’.. అంటూ మరికొందరు, ‘‘చాలా మంచి సందేశం ఇస్తున్నారు’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 12 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: పానీపూరీతో ఇదేం కాంబినేషన్ బాబోయ్.. ఈమె తింటున్నదేంటో తెలిస్తే..

Updated Date - Jul 03 , 2024 | 05:51 PM