Share News

Viral Video: పానీపూరీతో ఇదేం కాంబినేషన్ బాబోయ్.. ఈమె తింటున్నదేంటో తెలిస్తే..

ABN , Publish Date - Jul 03 , 2024 | 05:02 PM

‘‘పుర్రెకో బుద్ధి.. జిహ్వకో రుచి’’.. అన్న సామెత చందంగా.. కొందరు తినడంలోనూ చిత్రవిచిత్ర ప్రయోగాలు చేస్తుంటారు. ఇక చైనా వంటి దేశాల్లో అయితే ఏవేవో జీవులన్నింటినీ తినేస్తుంటారు. ఇలాంటి..

Viral Video: పానీపూరీతో ఇదేం కాంబినేషన్ బాబోయ్.. ఈమె తింటున్నదేంటో తెలిస్తే..

‘‘పుర్రెకో బుద్ధి.. జిహ్వకో రుచి’’.. అన్న సామెత చందంగా.. కొందరు తినడంలోనూ చిత్రవిచిత్ర ప్రయోగాలు చేస్తుంటారు. ఇక చైనా వంటి దేశాల్లో అయితే ఏవేవో జీవులన్నింటినీ తినేస్తుంటారు. ఇలాంటి విచిత్ర ఫుడ్ వీడియోలు సోషల్ మీడియాలో తరచూ చూస్తూనే ఉంటాం. తాజాగా, ఓ మహిళ చేసిన విచిత్ర ప్రయోగం చూసి అంతా షాక్ అవుతున్నారు. పానీపూరీతో పాటూ ఆమె తిన్న జీవిని చూసి ఖంగుతింటున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ పానీపూరీతో ఇదేం కాంబినేషన్ రా.. బాబోయ్’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. చైనాకు (Chinese woman) చెందిన ఓ మహిళ.. పానీపూరీ తినడం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఇందులో విశేషం ఏముందీ అని అనుకుంటున్నారా.. పానీపూరీతో పాటూ ఆమె తిన్న జీవిని చూసే అంతా షాక్ అవుతున్నారు. ఓ ప్లేటులో రెండు పానీపూరీలు (Panipuri) , ఓ టామోటాతో పాటూ ప్రాణంతో ఉన్న ఈల్ (eel fish) అనే రకం చేపను కూడా తీసుకొచ్చారు. ఆమె చేతికి ప్లేటు అందించగానే.. ముందుగా ఈల్ చేపను నోట్లో వేసుకుంది. బలవంతంగా చేపను నమిలేసి మింగేసింది.

Viral video: నాగుపాము సమీపానికి వెళ్లిన తాబేలు.. సడన్‌గా కోబ్రా కాటేయడంతో.. చివరకు..


ఆ తర్వాత చివరగా పానీపూరీని టేస్ట్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘భగవంతుడా.. వచ్చే జన్మలో కూడా వీరిని ఇలాగే పుట్టించు.. అప్పుడు వేరే మనుషులు వీరిని తినేయాలి’’.., ‘‘ఇలాంటి వారి వల్లే కరోనా వచ్చింది’’.., ‘‘ఇలాంటి చెత్తవన్నీ తింటారు.. ఏదో ఒక రోగాన్ని సృష్టిస్తారు’’.., ‘‘చేపతో పానీపూరీ కాంబినేషన్ ఏంట్రా బాబోయ్’’.., ‘‘నువ్వు మహిళవు కాదు.. పిశాచివి’’.., ‘‘వీళ్లు ఏదైనా తినేస్తారు’’.. అంటూ ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 36 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: ఇదేం ఐడియారా బాబూ..! స్కూటీని ఏకంగా బాత్రూంగా మార్చేశాడుగా..

Updated Date - Jul 03 , 2024 | 05:02 PM