Pilli Manikya Rao: సీఎం జగన్ ఏపీకి పట్టిన శని
ABN , Publish Date - Apr 13 , 2024 | 03:55 PM
సీఎం జగన్ (CM Jagan) ఏపీకి పట్టిన శని అని తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) సీనియర్ నేత పిల్లి మాణిక్యరావు (Pilli Manikya Rao) అన్నారు. శనివారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... జగన్ పాలనలో గ్రామాల్లో అభివృద్ధి శూన్యమన్నారు. ఏపీలో పలు గ్రామాలు చీకట్లో మగ్గుతున్నాయని.. అభివృద్ధిపై వైసీపీ సర్పంచ్‌లు ఎందుకు నోరు మెదపట్లేదని ప్రశ్నించారు.
అమరావతి: సీఎం జగన్ ఏపీకి పట్టిన శని అని తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) సీనియర్ నేత పిల్లి మాణిక్యరావు (Pilli Manikya Rao) అన్నారు. శనివారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... జగన్ పాలనలో గ్రామాల్లో అభివృద్ధి శూన్యమన్నారు. ఏపీలో పలు గ్రామాలు చీకట్లో మగ్గుతున్నాయని.. అభివృద్ధిపై వైసీపీ సర్పంచ్‌లు ఎందుకు నోరు మెదపట్లేదని ప్రశ్నించారు.
Chandrababu: ఎన్నికలపై నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం
రూ. 13 వేల కోట్ల పంచాయతీ నిధులను సీఎం జగన్ (CM Jagan) దారి మళ్లించారని మండిపడ్డారు. జగన్ దోపిడీతో ప్రజల జీవితాలు అస్తవ్యస్తమయ్యాయని చెప్పారు. టీడీపీ హయాంలో వేలకోట్లతో నిర్మించిన భవనాలకు వైసీపీ ప్రభుత్వం రంగులు వేసుకుందని ఎద్దేవా చేశారు. జగన్ చర్యలతో సర్పంచ్‌లు లబోదిబో మంటున్నారన్నారు. గ్రామాల్లో మహిళల ఆత్మ గౌరవాన్ని జగన్ దెబ్బతీశారని ధ్వజమెత్తారు. చంద్రబాబు హయాంలో నిర్మించిన రోడ్లకు జగన్ ప్రభుత్వం డ్రైన్లు కూడా నిర్మించలేదన్నాని మండిపడ్డారు.
Nara Lokesh: నీ ప్రచారం పిచ్చి తగలెయ్యా.. ఆఖరుకు ఆయన్నూ వదలలేదా.. జగన్ పదే పదే మీ బిడ్డ.. మీ బిడ్డ అంటూ ఊకదంపుడు ప్రసంగాలు చేస్తారే కానీ అభివృద్ధిని మాత్రం పట్టించుకోరని విరుచుకుపడ్డారు. జగన్ ఏపీకి పట్టిన క్యాన్సర్ గడ్డా అని ఎద్దేవా చేశారు. జగన్ ఏపీని భ్రష్టుపట్టించారని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం - జనసేన - బీజేపీ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పిల్లి మాణిక్యరావు అన్నారు.
ఇవి కూడా చదవండి
AP Elections: గుడివాడలో ఎమ్మెల్యే కొడాలి నానికి బిగ్ షాక్.. టీడీపీలోకి వైసీపీ సీనియర్ నేత
Elections 2024: అభ్యర్థి అవినాశ్ ను మార్చేందుకు యత్నాలు.. కుండ బద్దలు కొట్టిన షర్మిల..
మరిన్ని ఏపీ వార్తల కోసం...