Share News

KTR: లోటు వర్షపాతమా?.. సీఎం మాటలు విడ్డూరమంటూ కేటీఆర్ ట్వీట్

ABN , Publish Date - Mar 07 , 2024 | 10:58 AM

Telangana: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విరుచుకుపడ్డారు. నిన్న(బుధవారం) రాష్ట్ర వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టిన ‘రైతునేస్తం’ వీడియో కాన్ఫరెన్స్‌ కార్యక్రమంలో ఏడాదిగా సరైన వర్షపాతం లేకపోవడంతో రిజర్వాయర్లలో నీళ్లు అడుగంటుతున్నాయని, అందుకే అన్ని ప్రాంతాల్లో నీటి సమస్య తీవ్రంగా ఉందని సీఎం అన్నారు. ఈ వ్యాఖ్యలను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు.

KTR: లోటు వర్షపాతమా?.. సీఎం మాటలు విడ్డూరమంటూ కేటీఆర్ ట్వీట్

హైదరాబాద్, మార్చి 7: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై (CM Revanth Reddy) బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) విరుచుకుపడ్డారు. నిన్న(బుధవారం) రాష్ట్ర వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టిన ‘రైతునేస్తం’ వీడియో కాన్ఫరెన్స్‌ కార్యక్రమంలో ఏడాదిగా సరైన వర్షపాతం లేకపోవడంతో రిజర్వాయర్లలో నీళ్లు అడుగంటుతున్నాయని, అందుకే అన్ని ప్రాంతాల్లో నీటి సమస్య తీవ్రంగా ఉందని సీఎం అన్నారు. ఈ వ్యాఖ్యలను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ట్విట్టర్ వేదికగా సీఎంను విమర్శిస్తూ మాజీ మంత్రి వ్యాఖ్యలు చేశారు.

Mallareddy: మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డికి అధికారుల షాక్


కేటీఆర్ ట్వీట్ ఇదే..

‘‘ఐఎండీ లెక్కల ప్రకారం 2023-24 సంవత్సరానికి సాదరానికంటే 14శాతం ఎక్కువ వర్షపాతం(ఎక్సెస్ రెయిన్ ఫాల్) తెలంగాణలో అయ్యింది. నీటి సమస్యలను తీర్చి చావలేక, చాత కాక...లోటు వర్షపాతం అని సీఎం మాట్లాడటం విడ్డూరం. అబద్ధాలు, అలవికాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు సత్యం దూరం మాటలు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవర్తించడంతో తెలంగాణ ప్రజలు అసహ్యించుకుంటున్నారు. రైతు సమస్యలు తీరుస్తా అని అనడం అటుంచి... రైతు ఏం అర్థం చేసుకోవాలి మీ చేతగానితనాన్నా?’’ అంటూ ట్వీట్ చేశారు.

ktr-tweet.jpg

ఇవి కూడా చదవండి....

కరువును కలిసికట్టుగా ఎదుర్కొందాం!

Congress: లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు


మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 07 , 2024 | 11:00 AM