Share News

Harishrao: ఎమ్మెల్యే పాడి కౌశిక్‌పై క్రిమినల్ కేసుపై హరీష్‌రావు రియాక్షన్

ABN , Publish Date - Jul 03 , 2024 | 02:15 PM

Teangana: హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేయడంపై మాజీ మంత్రి హరీష్‌ స్పందించారు. ఎమ్మెల్యేపై క్రిమినల్ కేసు తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ట్విట్టర్ వేదికగా హరీష్ స్పందిస్తూ... ‘‘ప్రజల సమస్యలను జెడ్పీ సమావేశం దృష్టికి తీసుకురావడమే కౌశిక్ రెడ్డి చేసిన తప్పా.?’’...

Harishrao: ఎమ్మెల్యే పాడి కౌశిక్‌పై క్రిమినల్ కేసుపై హరీష్‌రావు రియాక్షన్
Former Minister Harish Rao

హైదరాబాద్, జూలై 3: హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై (MLA Padi Koushik Reddy) క్రిమినల్ కేసు నమోదు చేయడంపై మాజీ మంత్రి హరీష్‌ (Former Minister Harish Rao) స్పందించారు. ఎమ్మెల్యేపై క్రిమినల్ కేసు తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ట్విట్టర్ వేదికగా హరీష్ స్పందిస్తూ... ‘‘ప్రజల సమస్యలను జెడ్పీ సమావేశం దృష్టికి తీసుకురావడమే కౌశిక్ రెడ్డి చేసిన తప్పా.? ప్రశ్నించే గొంతులను అక్రమ కేసులు బనాయించి మూయించడమేనా ప్రజా పాలన.? కాంగ్రెస్ పాలనలో ప్రజాప్రతినిధులు సైతం ప్రభుత్వాన్నిప్రశ్నించలేని పరిస్థితి. ఇలాంటి బెదిరింపులకు బీఆర్ఎస్ పార్టీ భయపడదు. ప్రతీకార చర్యలను, అక్రమ కేసులను చట్టపరంగా ఎదుర్కొంటాం. ప్రజల తరుపున పోరాటం కొనసాగిస్తాం’’ అంటూ హరీష్‌రావు ట్వీట్ చేశారు.

Rajyasabha Updates: విపక్షాలకు ఎప్పటికీ అర్థంకాదు.. రాజ్యసభలో మోదీ సెటైర్లు..


కాగా... ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. బీఎన్ఎస్ యాక్టులో కేసు నమోదు అయిన మొట్టమొదటి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. నిన్న (మంగళవారం) జెడ్పీ సమావేశంలో ఎమ్మెల్యే వ్యవహారించిన తీరుపై జెడ్పీ సీఈవో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ పమేలా సత్పతి బయటికి వెళ్ళే సమయంలో ఎమ్మెల్యే కౌషిక్ రెడ్డి అడ్డుకుని బైఠాయించి నిరసనకు దిగారు. దీనికి సంబంధించి జెడ్పీ సీఈవో ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యేపై భారత్ న్యాయ్ సంహిత యాక్ట్ ప్రకారం సెక్షన్ 221,126 (2) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. బీఎన్‌ఎస్ యాక్ట్ అమలులోకి వచ్చిన రెండో రోజే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు అయ్యింది.


ఇవి కూడా చదవండి...

Virat Kohli: దటీజ్ విరాట్ కోహ్లీ.. దెబ్బకు ఆల్‌టైం రికార్డ్

TDP Office: టీడీపీ సెంట్రల్‌ ఆఫీస్‌పై దాడి కేసులో నిందితులెవరో తేల్చిన పోలీసులు

Read Latest Telangana News AND Telugu News

Updated Date - Jul 03 , 2024 | 02:15 PM