Share News

KTR :ఇది ప్రజా పాలన కాదు.. ముమ్మాటికీ ప్రజాకంఠక పాలన

ABN , Publish Date - Jul 05 , 2024 | 08:48 PM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy), కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి ట్విట్టర్(X) వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) తీవ్ర విమర్శలు గుప్పించారు.

KTR :ఇది ప్రజా పాలన కాదు.. ముమ్మాటికీ ప్రజాకంఠక పాలన
KTR

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy), కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి ట్విట్టర్(X) వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) తీవ్ర విమర్శలు గుప్పించారు.


నయవంచక సర్కారు ఇది..

‘‘సీఎం రేవంత్‌కు యువతపై ప్రేమ లేదు. నిరుద్యోగులు అంటే అసలే గౌరవం లేదు. నిరుద్యోగ యువతను నమ్మించి మోసం చేసిన నయవంచక సర్కారు ఇది.ఎన్నికల్లో నిరుద్యోగులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోమంటే ఇంత నిర్బంధమా ?? తెల్ల దొరల పాలన కన్నా.. దుర్మార్గంగా కాంగ్రెస్ సర్కార్ వ్యవహరిస్తోంది.ఓ వైపు ప్రజా పాలన అంటారు.. మరోవైపు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పాపానికి యువతను అక్రమంగా అరెస్టు చేస్తారా ? రాష్ట్రవ్యాప్తంగా ఇంతటి నిరంకుశ విధానాలను అవలంభిస్తారా ?? ఇది ప్రజా పాలన కాదు.. ముమ్మాటికీ ప్రజాకంఠక పాలన. ప్రచారంలో ఒక మాట.. ప్రభుత్వంలోకి వచ్చాక.. మరో మాట మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెండు నాల్కల వైఖరి తెలంగాణ యువతకు అర్థమైపోయింది. అక్రమంగా అరెస్టు చేసిన వారందరిని బేషరతుగా వెంటనే విడుదల చేయాలి. ఉద్యోగ నియామకాలు చేపట్టడంలో జాబ్ క్యాలెండర్ ప్రకటించడంలో.. అట్టర్ ఫ్లాప్ అయినందుకు.. వెంటనే నిరుద్యోగులకు.. కాంగ్రెస్ సర్కారు క్షమాపణలు చెప్పాలి. నిరుద్యోగుల ఆకాంక్షలను నెరవేర్చకుండా నిలువునా మోసం చేసిన కాంగ్రెస్ సర్కార్‌ను ఈ పాపం శాపమై భూస్థాపితం చేయడం ఖాయం’’ అని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - Jul 05 , 2024 | 08:51 PM