Lok Sabha Elections 2024: కిషన్‌రెడ్డి స్క్రిప్ట్ లీడర్... హిందూ సాంప్రదాయం గురించి తెలియదు: జగ్గారెడ్డి
ABN , Publish Date - Apr 27 , 2024 | 05:07 PM
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) స్క్రిప్ట్ లీడర్ అని.. ఆయనకు హిందూ సాంప్రదాయం గురించి ఏమాత్రం తెలియదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jaggareddy) అన్నారు. బీజేపీ రాష్ట్రాల అధ్యక్షులు అందరూ డమ్మిలేనని విమర్శించారు. ఎల్కే అద్వానీ భిక్షతోనే నరేంద్ర మోదీ ప్రధాని అయ్యారని చెప్పారు.
హైదరాాబాద్: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) స్క్రిప్ట్ లీడర్ అని.. ఆయనకు హిందూ సాంప్రదాయం గురించి ఏమాత్రం తెలియదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jaggareddy) అన్నారు. బీజేపీ రాష్ట్రాల అధ్యక్షులు అందరూ డమ్మిలేనని విమర్శించారు. ఎల్కే అద్వానీ భిక్షతోనే నరేంద్ర మోదీ ప్రధాని అయ్యారని చెప్పారు. శనివారం గాంధీ భవన్‌లో జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ... సోనియాగాంధీ, రాహుల్ గాంధీ కుటుంబం దేశ ప్రజల కుటుంబమని తెలిపారు.
ఉపాధి హామీ పథకం అంటే గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు అక్షయ పాత్ర లాంటిదని చెప్పుకొచ్చారు. గ్రామీణ అభివృద్ధి కోసం యూపీఏ చైర్మన్ సోనియా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చారని గుర్తుచేశారు.మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత అడ్డమైన కండీషన్లు పెట్టి ఈ పథకాన్ని రద్దు చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. మోదీ నిరుపేదలకు శాపంగా మారారని మండిపడ్డారు. దివంగత ప్రధానమంత్రి పీవీ నర్సింహారావుని ప్రధానిని చేసింది సోనియాగాంధీనే అని తెలిపారు.
TG Elections 2024: రేవంత్‌తో ముగిసిన సీపీఎం నేతల భేటీ.. ఆ సీటు త్యాగం
సోనియాగాంధీ 22 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారని వివరించారు. ప్రధాని కావాలనుకుంటే రెండు సార్లు అయ్యేవారని ఉద్ఘాటించారు. సోనియాగాంధీని విమర్శించే నైతిక హక్కు బీజేపీ నాయకులకు లేదన్నారు. బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్ ఓడిపోయామన్న ఫ్రస్టేషన్‌లో ఉన్నారన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలను పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరూ పట్టించుకోరన్నారు. కాంగ్రెస్‌లో స్వేచ్ఛ ఉందన్నారు. బీఆర్ఎస్ బీజేపీలోని నేతలకు స్వేచ్ఛ ఉండదని జగ్గారెడ్డి పేర్కొన్నారు.
Madhavilatha: మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్.. ఇన్‌స్టాలో పోస్టు చేసిన రేణుదేశాయ్
Read Latest Telangana News or Telugu News