AP NEWS: అమరావతి స్మృతి వనం పక్కనపెట్టారు.. జగన్‌పై మంత్రి బాల వీరాంజనేయ స్వామి ఫైర్
ABN , Publish Date - Jan 21 , 2025 | 06:46 PM
Dola Sree Bala Veeranjaneya Swamy: అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుపై చంద్రబాబు ముందుగా నిర్ణయం తీసుకున్నారని మంత్రి, డోలా బాల వీరాంజనేయ స్వామి చెప్పారు. అమరావతిలో భూమి కేటాయించారన్నారు. అమరావతి స్మృతి వనం పక్కనపెట్టి ఇక్కడ నిర్మాణం చేశారని మంత్రి, డోలా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు.

విజయవాడ: డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ విగ్రహా ఏర్పాటులో లోటు పాట్లు ఉంటే చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. విజయవాడలోని పీడబ్ల్యూడీ గ్రౌండ్స్‌లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం, విగ్రహ పరిసర ప్రాంతాలను మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి మంగళవారం నాడు పరిశీలించారు. అంబేద్కర్ మ్యూజియాన్ని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ... అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుపై చంద్రబాబు ముందుగా నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. అమరావతిలో భూమి కేటాయించారని గుర్తుచేశారు. అమరావతి స్మృతివనం పక్కనపెట్టి ఇక్కడ నిర్మాణం చేశారని తెలిపారు. ఎన్నికల ముందు హడావుడిగా అంబేద్కర్ విగ్రహాన్ని జగన్ ప్రారంభించారని మండిపడ్డారు. ఇక్కడ చూస్తే చాలా పనులు చేయాల్సి ఉందని అన్నారు. ఇంకా పనులు పూర్తి కాలేదని తెలిపారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ మొత్తం పూర్తి చేస్తామని అన్నారు. కక్ష సాధింపు చర్యలు కూటమి ప్రభుత్వంలో ఉండవని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు.
అంబేద్కర్ విగ్రహ నిర్మాణంలో అవినీతి: బొండా ఉమామహేశ్వరరావు
అంబేద్కర్ స్మృతి వనాన్ని అమరావతిలో కట్టాలని 2014లో తొలుత నిర్ణయించామని ప్రభుత్వం విప్, టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు. జగన్ ప్రభుత్వం అమరావతి విచ్ఛిన్నం చేసి బెజవాడలో విగ్రహాన్ని పెట్టారన్నారు. అంబేద్కర్ విగ్రహ నిర్మాణంలో అవినీతి జరిగినట్లు అనేక ఆరోపణలు వచ్చాయని చెప్పారు. అంబేద్కర్ స్మృతి వనం మరింత అభివృద్ధి చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిదన్నారు. ఇంకా చేయాల్సిన పనులు ఏం ఉన్నాయనేది సమీక్ష చేస్తామని చెప్పారు. ఈ సమీక్షలో నిర్ణయం తీసుకుని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తామని బొండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు.
వైసీపీ పాలనలో విశాఖ ఉక్కు ప్రయోజనాలను కూడా తాకట్టు పెట్టేశారు: జీవీ ఆంజనేయులు
పల్నాడు జిల్లా: కూటమి ప్రభుత్వం వచ్చిన 7 నెలల్లో ఏపీకి రూ.4లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు తెలిపారు. సీఎం చంద్రబాబు కృషి కారణంగానే పరిశ్రమలు, పెట్టుబడుల గమ్యస్థానంగా ఏపీ ఉందన్నారు. కేంద్రం నుంచి, పరిశ్రమలు, పెట్టుబడుల రూపంలో రాష్ట్రానికి జగన్ తెచ్చింది శూన్యమని విమర్శించారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో విశాఖ ఉక్కు ప్రయోజనాలను కూడా తాకట్టు పెట్టేశారని మండిపడ్డారు. 7 నెలల్లోనే ఐదేళ్ల వైసీపీ - కూటమి పాలన మధ్య తేడాను ప్రజలు గమనించారని అన్నారు. వినుకొండలో శివశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 4 బస్ షెల్టర్లు నిర్మిస్తామని చెప్పారు. త్వరితగతిన వినుకొండ రామలింగేశ్వరాలయం, ఘాట్‌రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తామని చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Palla Srinivas: టీడీపీ కోటి సభ్యత్వం.. ఆ ముగ్గురిదే ఘనత
Chandrababu: వీర జవాన్ కార్తీక్ మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం..
CM Chandrababu: దిగ్గజ కంపెనీల అధిపతులతో సమావేశాలు.. చంద్రబాబు షెడ్యూల్ ఇదే
Read Latest AP News And Telugu News