Minister Kollu Ravindra: జగన్ డ్రామాలను ప్రజలు ఛీకొడుతున్నారు.. మంత్రి కొల్లు రవీంద్ర విసుర్లు
ABN , Publish Date - Feb 21 , 2025 | 03:22 PM
Minister Kollu Ravindra: మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై మంత్రి కొల్లు రవీంద్ర సంచలన ఆరోపణలు చేశారు. పెయిడ్ ఆర్టిస్టులను రైతులుగా నిలబెట్టి... ఐ ప్యాక్ చేత జగన్ చేస్తున్న డ్రామాలను ప్రజలు ఛీ కొడుతున్నారని విమర్శించారు.

కృష్ణాజిల్లా ( గుడివాడ): మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి (YS Jagan Mohan Reddy) ఐ ప్యాక్ డ్రామాలను ప్రజలు నమ్మరని మంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra) విమర్శించారు. గుడివాడ టీడీపీ కార్యాలయంలో మంత్రి రవీంద్ర ఇవాళ(శుక్రవారం) మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ... అధికారంలో ఉండగా చేసిన తప్పులను ప్రశ్నిస్తామనే భయంతోనే జగన్ అసెంబ్లీకి రావడం లేదని విమర్శించారు. పోలీసులను బెదిరించే నీచ రాజకీయాలకు జగన్ తెర లేపారని మండిపడ్డారు. దళిత సోదరుని కిడ్నాప్ చేస్తే కేసులు పెట్టరా? అని ప్రశ్నించారు. ప్రజలు గుడ్డలూడదీసి రోడ్డుమీద నిల్చోపెట్టిన... జగన్ ప్రవర్తనలో మార్పు రావడం లేదని ఆక్షేపించారు. జగన్ ఏం మాట్లాడుతున్నాడో ఎవరికి అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు.
ALSO READ: Rammohan Naidu: ఏపీ మిర్చి రైతుల సమస్యలపై కేంద్రం నిర్ణయం ఇదే..
మిర్చి రైతుల సమస్యలపై కేంద్ర మంత్రితో సీఎం చంద్రబాబు మాట్లాడారని తెలిపారు. ఎన్నికల కోడ్ ఉందని అధికారులు చెప్పిన... రాజకీయ స్వార్థానికే జగన్ మిర్చి యార్డ్‌కు వెళ్లారని అన్నారు. పెయిడ్ ఆర్టిస్టులను రైతులుగా నిలబెట్టి... ఐ ప్యాక్ చేత జగన్ చేస్తున్న డ్రామాలను ప్రజలు ఛీ కొడుతున్నారని విమర్శించారు. మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలకు మంత్రి రవీంద్ర కౌంటర్ ఇచ్చారు. బూతులు మాట్లాడటానికైతే ఉద్యోగం అవసరం.. ప్రజాసేవ చేయడానికి ఉద్యోగం కావాలా? అని ప్రశ్నించారు. ప్రతిపక్షం, అధికారంలో ఉన్న... ప్రజలకు జవాబుదారీగానే తాము పని చేశామని స్పష్టం చేశారు. అవినీతి, అరాచకాలు, విధ్వంసంతో నాశనమైన కృష్ణాజిల్లా... ఖ్యాతిని తిరిగి తీసుకువచ్చేందుకు కూటమి నేతలంతా కలిసి కష్టపడుతున్నామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Viveka Case: వివేకా హత్య కేసులో పీఏ కృష్ణారెడ్డికి ఎదురుదెబ్బ
Vamshi Case: మళ్లీ సమయం కోరిన పోలీసులు.. వంశీ న్యాయవాదుల అభ్యంతరం
Read Latest AP News And Telugu News