Viral Video: ఈజీగా చోరీ చేయడమంటే ఇదేనేమో.. ఈ కోతి స్కెచ్ మామూలుగా లేదుగా..
ABN , Publish Date - Jan 08 , 2025 | 05:24 PM
కోతి చేష్టలు కొన్నిసార్లు చిరాకు తెప్పిస్తే.. మరికొన్నిసార్లు తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. అలాగే ఇంకొన్నిసార్లు అంతా ఆశ్చర్యపోయేలా ఉంటాయి. కొన్ని కోతులు మనుషులను బెదిరించి మరీ తినుబండారాలు ఎత్తుకెళ్తే.. మరికొన్ని కోతులు దొంగచాటుగా తస్కరిస్తుంటాయి. ఇంకొన్ని కోతులు అయితే..
కోతి చేష్టలు కొన్నిసార్లు చిరాకు తెప్పిస్తే.. మరికొన్నిసార్లు తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. అలాగే ఇంకొన్నిసార్లు అంతా ఆశ్చర్యపోయేలా ఉంటాయి. కొన్ని కోతులు మనుషులను బెదిరించి మరీ తినుబండారాలు ఎత్తుకెళ్తే.. మరికొన్ని కోతులు దొంగచాటుగా తస్కరిస్తుంటాయి. ఇంకొన్ని కోతులు అయితే ఎంతో తెలివిగా చోరీ చేస్తుంటాయి. ఇలాంటి చిత్రవిచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. దుకాణంలోని చిప్స్ ప్యాకెట్లను ఓ కోతి ఎత్తుకెళ్లడం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియోను చూసిన వారంతా.. ‘‘ఈజీగా చోరీ చేయడమంటే ఇదేనేమో’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ కోతికి బాగా ఆకలేసినట్టుంది. ఆహారం కోసం ఎక్కడ వెతికినా కనిపించలేదు. పైగా ఎవరూ దానికి ఆహారం కూడా వేయలేనట్టుంది. దీంతో చివరకు ఆ కోతికి చిర్రెత్తుకొచ్చి.. ఎలాగైనా ఏదోటి ఎత్తుకురావాలని ఫిక్స్ అయింది. ఇలా చూస్తుండగా దానికి ఓ దుకాణం కనిపించింది.
Viral Video: కేజీఎఫ్ సినిమాను గుర్తు చేస్తున్న బైక్.. చూస్తే షాక్ అవ్వాల్సిందే..
దుకాణానికి ముందు వేలాడుతున్న చిప్స్ ప్యాకెట్లపై కన్నేసింది. దుకాణం రేకుల పైకి ఎక్కిన కోతి.. మెల్లగా ముందు వైపునకు వచ్చి, చిప్ ప్యాకెట్లలో ఒకదాన్ని లాక్కుంటుంది. ఎవరికీ తెలికుండా చిప్స్ ప్యాకెట్లను ఎంతో (monkey stole chips packets) చాకచక్యంగా తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఈ కోతి విచిత్రంగా చోరీ చేయడం చూసి అంతా అవాక్కతున్నారు. అక్కడే ఉన్న కొందరు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
Viral Video: మందుబాబులా మజాకా.. డ్రంకెన్ డ్రైవ్ చేయకుండా కారును ఎలా తీసుకెళ్లారంటే..
ఈ వీడియో ప్రస్తుతం తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘పార్టీలోకి చిప్స్ తక్కువ వచ్చినట్లున్నాయ్’’.. అంటూ కొందరు, ‘‘ఈ డబ్బులను కోతి ఖాతాలో రాసుకో బ్రదర్’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4.55 లక్షలకు పైగా వ్యూ్స్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: కొంపతీసి రైల్లో ఇలాగానీ చేస్తున్నారా.. ఫోన్‌కు వీళ్లెలా చార్జింగ్ పెడుతున్నారంటే..
ఇవి కూడా చదవండి..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..
Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..
Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..
Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..