Viral Video: బర్త్‌డే కేక్‌లో బాంబ్.. కట్ చేయాలని చూడగా.. చివరకు ఏమైందో చూడండి..
ABN , Publish Date - Jan 06 , 2025 | 07:56 PM
పుట్టిన రోజు వేడుకల్లో రోజు రోజుకూ తీరు మారుతున్నాయి. కేక్ కటింగ్ పేరుతో యువకులు చిత్రవిచిత్రమైన పనులు చేయడం సర్వసాధారణమైంది. పుట్టిన రోజు జరుపుకొనే వ్యక్తి తలను బలవంతంగా కేక్‌లో పెట్టడం, స్నేహితులంతా చుట్టూ చేరి ముఖానికి కేకు పూస్తూ ఊపిరాడకుండా చేయడం వంటి వికృత చేష్టలు చేస్తుంటారు. ఇలాంటి..
పుట్టిన రోజు వేడుకల్లో రోజు రోజుకూ తీరు మారుతున్నాయి. కేక్ కటింగ్ పేరుతో యువకులు చిత్రవిచిత్రమైన పనులు చేయడం సర్వసాధారణమైంది. పుట్టిన రోజు జరుపుకొనే వ్యక్తి తలను బలవంతంగా కేక్‌లో పెట్టడం, స్నేహితులంతా చుట్టూ చేరి ముఖానికి కేకు పూస్తూ ఊపిరాడకుండా చేయడం వంటి వికృత చేష్టలు చేస్తుంటారు. ఇలాంటి పనులు కొన్నిసార్లు వారి ప్రాణం మీదకు వస్తుంటుంది. కొందరు యువకులు ఇలాంటి సందర్భా్ల్లో చనిపోవడం కూడా చూశాం. తాజాగా, ఓ కేక్‌లో బాంబ్ పెట్టి మరీ వేడకులను చేయడం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడు తన పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ (Birthday cake cutting) చేసేందుకు సిద్ధమవుతాడు. స్నేహితులు కేక్‌ను సిద్ధం చేసి అతడి చేతికి అందిస్తారు. బెడ్‌పై కూర్చున్న బర్త్‌డే బాయ్.. కేక్ కట్ చేసేందుకు రెడీ అవుతాడు. అయితే ఈ సమయంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది.
Viral Video: నీళ్లలో మునిగిన వ్యక్తి.. పైన మంట వెలిగించిన స్నేహితులు.. చివరకు చూస్తే..
కేక్ పైన ఏర్పాట్లు చేసిన స్టిక్ సడన్‌గా మండుతుది. దీంతో అతను భయపడి కేక్‌ను కాస్త దూరంగా పట్టుకుంటాడు. అయితే అంతలోనే (cake exploded like bomb) ఆ కేక్ మొత్తం బ్లాస్ట్ అయిపోతుంది. పెద్ద శబ్ధంతో పగిలిపోయిన కేక్.. చుట్టూ ఉన్న గోడలపై పడిపోతుంది. ఈ ఘటనతో పుట్టిన రోజు జరుపుకుంటున్న వ్యక్తి.. మంచంపై నుంచి పక్కకు దూకేసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇలా బర్త్‌డే పేరుతో స్నేహితుడి ప్రాణం పోయేంత పని చేశారు.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలోని వివిధ వేదికల్లో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తు్న్నారు. ‘‘ఇదెక్కడి కేక్ కటింగ్‌రా నాయనా’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి పనులు చేయడం ప్రాణాలకే ప్రమాదం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 11 వేలకు పైగా వ్యూ్స్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: వామ్మో.. ఇదెక్కడి చోరీరా నాయనా.. స్వీటు షాపులో ఈమె చేస్తున్న నిర్వాకం చూడండి..
ఇవి కూడా చదవండి..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..
Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..
Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..
Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..