Share News

Viral Video: మందుబాబులా మజాకా.. డ్రంకెన్ డ్రైవ్ చేయకుండా కారును ఎలా తీసుకెళ్లారంటే..

ABN , Publish Date - Jan 08 , 2025 | 03:21 PM

మందుబాబులు ఒక పెగ్గు వేశారంటే చాలు.. ఇక వారి లోపలి మనిషి మేల్కొంటాడు. కిక్కు ఎక్కగానే ఏం చేస్తారో వారికే తెలీదు. కొందరు విచిత్ర విన్యాసాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిస్తే.. మరికొందరు ప్రమాదకరంగా డ్రైవింగ్ చేస్తూ పోలీసులకు పట్టుబడుతుంటారు. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా..

Viral Video: మందుబాబులా మజాకా.. డ్రంకెన్ డ్రైవ్ చేయకుండా కారును ఎలా తీసుకెళ్లారంటే..
Drunken youths carrying car

మందుబాబులు ఒక పెగ్గు వేశారంటే చాలు.. ఇక వారి లోపలి మనిషి మేల్కొంటాడు. కిక్కు ఎక్కగానే ఏం చేస్తారో వారికే తెలీదు. కొందరు విచిత్ర విన్యాసాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిస్తే.. మరికొందరు ప్రమాదకరంగా డ్రైవింగ్ చేస్తూ పోలీసులకు పట్టుబడుతుంటారు. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. మందు తాగిన కొందరు స్నేహితులు.. డ్రంకెన్ డ్రైవ్ చేయకూడదనే ఉద్దేశంతో చివరకు కారును విచిత్రంగా తీసుకెళ్లారు. ఈ వీడియో చూసిన వారంతా షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కొందరు యువకుడు బార్‌లోకి వెళ్లి ఫుల్‌గా మందు కొడతారు. తాగిన తర్వాత బార్ నుంచి బయటికి వచ్చిన వారు.. తమ కారు వద్దకు వెళ్తారు. ఈ పరిస్థితుల్లో సాధారణంగా ఎవరైనా కారులో కూర్చుని దూసుకెళ్లిపోతారు. అయితే వీళ్లు మాత్రం డ్రంకెన్ డ్రైవ్ చేయకూడదని అనుకున్నారో ఏమో గానీ.. చివరకు విచిత్ర నిర్ణయం తీసుకున్నారు.

Viral Video: బర్త్‌‌డే కేక్‌లో బాంబ్.. కట్ చేయాలని చూడగా.. చివరకు ఏమైందో చూడండి..


అంతా కలిసి కారు చుట్టూ చేరి చేతులపైకి ఎత్తుకున్నారు. చివరకు కారును ఎలాగోలా తమ భుజాలపైకి (Drunken people carrying car on their shoulder) ఎత్తుకుని రోడ్డుపై నడుస్తూ వెళ్లారు. అంతా చూస్తుండగానే కారును మోసుకుంటూ వెళ్లి.. చివరకు టోల్‌గేట్ కూడా దాటించారు. ఇది ఎంతవరకూ నిజమో ఏమో గానీ.. వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Viral Video: నీళ్లలో మునిగిన వ్యక్తి.. పైన మంట వెలిగించిన స్నేహితులు.. చివరకు చూస్తే..


ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ మందుబాబులు డ్రంకెన్ డ్రైవ్‌ను చాలా సీరియస్‌గా తీసుకున్నారు’’.. అంటూ కొందరు, ‘‘ఇది మరీ ఓవర్‌గా ఉంది బ్రదర్’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 700కి పైగా లైక్‌లు, 13వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: రోడ్డుపై డాన్స్ చేస్తూ రీల్ చేస్తున్న యువతి.. సడన్‌గా వెనుక నుంచి వచ్చిన వ్యక్తి.. చివరకు చూస్తే..


ఇవి కూడా చదవండి..

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..

Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..

Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..

Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..

Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..

Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 08 , 2025 | 03:21 PM