Viral Video: కేజీఎఫ్ సినిమాను గుర్తు చేస్తున్న బైక్.. చూస్తే షాక్ అవ్వాల్సిందే..
ABN , Publish Date - Jan 08 , 2025 | 04:20 PM
కొన్నిసార్లు సినిమా తరహా సంఘనలు నిజ జీవితంలో మన కళ్ల ముందే జరుగుతుంటాయి. మరికొన్నిసార్లు సినిమా సీన్లకు మించిన ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బైక్ వీడియో.. కేజీఎఫ్ సినిమాను గుర్తుకుతెస్తోంది. ఆ సినిమాలో..
కొన్నిసార్లు సినిమా తరహా సంఘనలు నిజ జీవితంలో మన కళ్ల ముందే జరుగుతుంటాయి. మరికొన్నిసార్లు సినిమా సీన్లకు మించిన ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బైక్ వీడియో.. కేజీఎఫ్ సినిమాను గుర్తుకుతెస్తోంది. ఆ సినిమాలో తుపాకీ ముందు భాగం మొత్తం ఎర్రగా మారిన సీన్ అంతా చూసే ఉంటారు. అలా ఎర్రగా మారిన ఆ గన్‌కు హీరో సిగరెట్ అంటించుకుంటాడు. అయితే ఇదే సీన్ కొంచెం అటు ఇటుగా ఇక్కడ కూడా జరిగింది. ఈ వీడియోలోని బైక్‌ను చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడు తన బైకును విచిత్రంగా మార్చేశాడు. బైకు సైలెన్సర్ పూర్తిగా ఎర్రగా మారడం చూసి అంతా అవాక్కవుతున్నారు. ముందుగా ఈ సైలెన్స్‌ను చూసిన వారంతా.. దానికి ఎరుపు రంగు వేశారేమో అని అనుకున్నారు. కానీ చివరకు అసలు విషయం తెలుసుకుని షాక్ అయ్యారు.
Viral Video: మందుబాబులా మజాకా.. డ్రంకెన్ డ్రైవ్ చేయకుండా కారును ఎలా తీసుకెళ్లారంటే..
బైకును బాగా రైజ్ చేయడంతో చివరకు సైలెన్సర్ కూడా (bike silencer has turned red) ఎర్రగా మారిపోయింది. అది కూడా ఎంతలా అంటే.. దానికి ఏదైనా తగిలితే మండిపోయేంతలా మారిపోయింది. ఇలా నిప్పులు కక్కుతున్న సైలెన్సర్‌కు ఓ వ్యక్తి గడ్డిని తగిలించాడు. దీంతో అది ఒక్కసారిగా మండిపోతుంది. ఇలా ఎర్రగా మారిన సైలెన్సర్ బైకును చూసి అంతా అవాక్కవుతున్నారు.
Viral Video: బర్త్‌డే కేక్‌లో బాంబ్.. కట్ చేయాలని చూడగా.. చివరకు ఏమైందో చూడండి..
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఈ బైక్ మరీ విచిత్రంగా ఉందే’’.. అంటూ కొందరు, ‘‘ఈ బైకును చూస్తుంటే కేజీఎఫ్ సినిమా గుర్తుకొస్తోంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 800కి పైగా లైక్‌లు, 6.59 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..
Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..
Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..
Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..