Share News

Viral Video: మరణం పలకరించడమంటే ఇదేనేమో.. ఈ బైకర్ల పరిస్థితి చూస్తే..

ABN , Publish Date - Mar 26 , 2025 | 01:09 PM

రోడ్డుపై వాహనాలు రద్దీగా రాకపోకలు సాగిస్తుంటాయి. అక్కడే కూడలి ఉండడంతో వాహనాలు అటూ, ఇటూ పాస్ అవుతుంటాయి. ఇంతవరకూ అంతా బాగానే ఉన్నా.. ఇక్కడే ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.

Viral Video: మరణం పలకరించడమంటే ఇదేనేమో.. ఈ బైకర్ల పరిస్థితి చూస్తే..

‘‘చావు అంచుల దాకా వెళ్లి తిరిగొచ్చాడు.. రెప్పపాటులో తప్పిన ప్రమాదం’’.. అని అప్పుడప్పుడూ అంటుంటాం. కొందరు పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి క్షేమంగా తప్పించుకుంటుంటారు. మరికొన్నిసార్లు కొందరు దాదాపు మరణం అంచుల వరకూ వెళ్తుంటారు. ఇలాంటి సమయాల్లో అప్పుడప్పుడూ అద్భుతాలు జరుగుతుంటాయి. ఈ తరహా సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇద్దరు బైకర్లకు ఎదురైన షాకింగ్ అనుభవానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు .. ‘‘మరణం పలకరించడమంటే ఇదేనేమో’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో చాలా కాలం క్రితం చోటు చేసుకున్న ఘటనలు సంబంధించిన వీడియో (Viral Video) ప్రస్తుతం మళ్లీ వైరల్ అవుతోంది. రోడ్డుపై వాహనాలు రద్దీగా రాకపోకలు సాగిస్తుంటాయి. అక్కడే కూడలి ఉండడంతో వాహనాలు అటూ, ఇటూ పాస్ అవుతుంటాయి. ఇంతవరకూ అంతా బాగానే ఉన్నా.. ఇక్కడే ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.

Theft Viral Video: రోడ్డు పక్కన సమోసాలు తింటున్న వ్యక్తి.. వెనుకే నిలబడ్డ దొంగ.. చివరకు జరిగింది చూస్తే..


ఓ బైకర్ చాలా వేగంగా వెళ్తుంటాడు. అయితే కూడలి వద్ద ఓ వైపు నుంచి మరో బైకర్ అంతే వేగంగా వచ్చి రోడ్డు దాటుతాడు. ఈ ఇద్దరూ ఒకేసారి పక్క పక్కనే పాస్ అయిపోతారు. అది కూదా ఎంత దగ్గర అంటే.. వెంట్రుకవాసిలో దాటుకుంటారు. ఈ క్రమంలో ఒక్క ఇంచు అటూ, ఇటూ అయినా ఇద్దరూ ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉండేది. అయితే ఈ ఘటనలో ఇద్దరూ క్షేమంగా బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Rhino vs Animals: జంతువులతో పోటీ పడ్డ ఖడ్గమృగం.. దేనికి భయపడిందో చూస్తే షాకవ్వాల్సిందే..


ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘చావు అంచుల దాకా వెళ్లిరావడమంటే ఇదే’’.. అంటూ కొందరు, ‘‘ఈ బైకర్లకు భూమ్మీద నూకలున్నాయ్’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3,800కి పైగా లైక్‌‌లు, 5.57 లక్షలకు పైగా వ్యూస్‌‌ను సొంతం చేసుకుంది.

Marriage Viral Video: పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయిస్తారంటే ఇదేనేమో.. వరుడు లక్కీ ఛాన్స్ కొట్టాడుగా..


ఇవి కూడా చదవండి..

Monkey Viral Video: తల్లి ప్రేమకు నిలువెత్తు నిదర్శనం.. ఈ కోతి చేసిన పని చూస్తే ఆశ్చర్యపోతారు..

Tricks Viral Video: సబ్బు వేస్ట్ అవుతోందా.. ఈమె చేసిన ట్రిక్ చూస్తే ఆశ్చర్యపోతారు..

Marriage Funny Video: వరుడి కొంపముంచిన యువతి.. వధువు ఎదుటే కౌగిలించుకోవడంతో.. చివరకు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 26 , 2025 | 01:09 PM