Marriage Funny Video: ఉంగరం తీస్తున్నారా.. యుద్ధం చేస్తున్నారా.. ఈ వధూవరులు ఏం చేస్తున్నారో చూడండి..
ABN , Publish Date - Feb 23 , 2025 | 10:08 AM
ఓ వివాహ కార్యక్రమంలో వధూవరుల మధ్య చోటు చేసుకున్న ఘటన అందరికీ తెగ నవ్వు తెప్పిస్తోంది. అన్ని వివాహాల్లో మాదిరే ఇక్కడ కూడా వధూవరులకు అనేక పోటీలు పెట్టారు. ఇందులో భాగంగా పాలలో ఉంగరాన్ని తీసే పోటీని కూడా పెట్టారు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ..

ప్రస్తుతం జరిగే వివాహాలన్నీ వింతలు, వినోదాలకు కేంద్రంగా మారుతున్నాయి. కొన్ని పెళ్లిళ్లలో అయితే సినిమా సీన్లను తలదన్నే సంఘటనలు చోటు చేసుకోవడం చూస్తున్నాం. ఇలాంటి ఘటనలన్నీ వీడియోల రూపంలో నెట్టింట్లో తెగ సందడి చేస్తుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. వివాహ వేడుకలో వధూవరుల మధ్య పాలలో ఉంగరం తీసే పోటీ నిర్వహించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘ఉంగరం తీస్తు్న్నారా.. యుద్ధం చేస్తున్నారా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ (Marriage) కార్యక్రమంలో వధూవరుల మధ్య చోటు చేసుకున్న ఘటన అందరికీ తెగ నవ్వు తెప్పిస్తోంది. అన్ని వివాహాల్లో మాదిరే ఇక్కడ కూడా వధూవరులకు అనేక పోటీలు పెట్టారు. ఇందులో భాగంగా పాలలో ఉంగరాన్ని తీసే పోటీని కూడా పెట్టారు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే తమాషా సంఘటన చోటు చేసుకుంది.
Dog Viral Video: వావ్..! ఇది కదా క్యాచ్ అంటే.. పడిపోతున్న కుక్కను ఎలా కాపాడిందో చూస్తే..
పాలలో ఉంగరం తీసేందుకు వధూవరులు (bride and groom) పోటీపడడం సహజమే. అయితే ఈ వధూవరులు మాత్రం ఏకంగా యుద్ధం చేసినంత పని చేశారు. పాలలో మునిగిపోయిన ఉంగరాన్ని (ring in milk) తీసేందుకు వరుడు ఒక చేత్తో ప్రయత్నిస్తే.. వధువు తన రెండు చేతులనూ పాలలో ముంచేసింది. వరుడి చేయిని పక్కకు లాగి, తాను ఉంగరం తీసుకునేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో పాత్రలోని పాలన్నీ కింద పడిపోయాయి. ఇలా వధూవరులు ఉంగరం కోసం చాలా సేపు పెద్ద యుద్ధమే చేశారు.
Viral Video: ఏనుగుల పంట పండిందిగా.. రోడ్డుపై నారింజ పండ్ల ట్రక్కు ఆగిపోవడంతో.. చివరకు..
ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. కాగా, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఉంగరం తీస్తున్నారా.. లేక యుద్ధం చేస్తున్నారా’’.. అంటూ కొందరు, ‘‘వధూవరుల మధ్య పోటీ మామూలుగా లేదుగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1900కి పైగా లైక్‌లు, 4.93 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Marriage Funny Video: చెడగొట్టారు కదరా.. జ్యూస్‌లో మందు కలిపి వరుడికి ఇవ్వడంతో.. చివరకు..
ఇవి కూడా చదవండి..
Bride And Groom Video: ఫొటో తీస్తూ వధువును పదే పదే తాకుతున్న కెమెరామెన్.. వరుడు గమనించడంతో చివరకు..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..