Marriage Funny Video: చెడగొట్టారు కదరా.. జ్యూస్‌లో మందు కలిపి వరుడికి ఇవ్వడంతో.. చివరకు..
ABN , Publish Date - Feb 22 , 2025 | 12:28 PM
ఓ వివాహ కార్యక్రమంలో వధూవరులు వేదికపై ఉండగా తమాషా సంఘటన చోటు చేసుకుంటుంది. వరుడి స్నేహితులంతా కలిసి వరుడిని ఫూల్ చేయాలని చూస్తారు. ఇందుకోసం ఫ్రూటీ జ్యూస్‌లో ఇంజెక్షన్ సాయంతో మద్యం కలిపేస్తారు..

పెళ్లిళ్లలో అనేక రకాల ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కొన్నిసార్లు తమాషా సంఘటనలు, మరికొన్నిసార్లు షాకింగ్ ఘటనలు, ఇంకొన్నిసార్లు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసే సంఘటనలు జరుగుతుంటాయి. చివరకు ఇవన్నీ కలిసి సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంటాయి. తాజాగా, ఇలాంటి ఓ వివాహ కార్యక్రమంలో చోటు చేసుకున్న తమాషా సంఘటన వీడియో తెగ వైరల్ అవుతోంది. స్నేహితులంతా కలిసి జ్యూస్‌లో మందు కలిపి వరుడికి అందించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘మొత్తానికి వరుడిని చెడగొట్టారు కదరా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ (Marriage) కార్యక్రమంలో వధూవరులు వేదికపై ఉండగా తమాషా సంఘటన చోటు చేసుకుంటుంది. వరుడి స్నేహితులంతా కలిసి వరుడిని ఫూల్ చేయాలని చూస్తారు. ఇందుకోసం ఫ్రూటీ జ్యూస్‌లో (Man Mixes Alcohol in Fruity Juice) ఇంజెక్షన్ సాయంతో మద్యం కలిపేస్తారు. పైకి ఎలాంటి అనుమానం రాకుండా అందులో స్ట్రా వేసి, తీసుకెళ్లి వరుడికి అందిస్తారు.
Funny Viral Video: ఓపిక లేని మహిళ.. లిఫ్ట్ వద్ద చేసిన నిర్వాకం చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..
ఫ్రూటీ జ్యూస్‌ను తీసుకున్న వరుడికి టేస్ట్ చేయగానే విషయం అర్థమైపోతుంది. అందులో మందు కలిపారనే విషయం తెలుసుకున్న వరుడు.. నవ్వుతూ దాన్ని తిరిగి స్నేహితుడికే అందిస్తాడు. మధ్యలో ఉన్న వధువు ఇదంతా గమనిస్తుంటుంది. చివరకు ఆమె కూడా విషయం అర్థమై నవ్వుకుంటుంది. ఇలా మందు కలిపిన జ్యూస్‌ను వరుడికి అందించి ఆటపట్టించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘పూజ చేస్తున్న సమయంలో ఇలా మందు కలిపి ఇవ్వడం సరికాదు’’.. అంటూ కొందరు, ‘‘ఫ్రూటీని కాస్తా చివరకు మందు బాటిల్‌ను చేశారు కదరా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 18 లక్షలకు పైగా లైక్‌లు, 66 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: కప్పే కదా అని తక్కువ అంచనా వేస్తే ఇలాగే అవుతుంది.. ఈ పాము పరిస్థితి చూస్తే..
ఇవి కూడా చదవండి..
Bride And Groom Video: ఫొటో తీస్తూ వధువును పదే పదే తాకుతున్న కెమెరామెన్.. వరుడు గమనించడంతో చివరకు..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..