Cooking Viral Video: వంట చేస్తున్నాడా.. తాపీ పని చేస్తున్నాడా.. ఇతడి కుకింగ్ చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
ABN , Publish Date - Feb 22 , 2025 | 10:34 AM
కొందరు చేసే పనులు సాధారణంగా అనిపిస్తే.. మరికొందరు చేసే పనులు చూస్తే అసాధరణంగా అనిపిస్తుంటాయి. అలాగే ఇంకొందరు చేసే పనులు చూస్తే అనితర సాధ్యం అనిపిస్తుంటుంది. ఇలాంటి చిత్రవిచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలను నిత్యం సోషల్ మీడియాలో చూస్తుంటాం. అయితే..

కొందరు చేసే పనులు సాధారణంగా అనిపిస్తే.. మరికొందరు చేసే పనులు చూస్తే అసాధరణంగా అనిపిస్తుంటాయి. అలాగే ఇంకొందరు చేసే పనులు చూస్తే అనితర సాధ్యం అనిపిస్తుంటుంది. ఇలాంటి చిత్రవిచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలను నిత్యం సోషల్ మీడియాలో చూస్తుంటాం. అయితే తాజాగా, వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి వంట చేయడం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఇతను వంట చేస్తున్నాడా.. తాపీ పని చేస్తున్నాడా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి వంట చేయడం చూసి అంతా అవాక్కవుతున్నారు. సిమెంట్ పని చేసేవారు ఎలాగైతే.. పారతో సిమెంట్ కలుపుతుంటారో.. ఈ వ్యక్తి కూడా అచ్చం అలాగే పొడవాటి ఇనుప పారతో (man cooking with iron shovel) పాత్రలోని ఆహార పదార్థాలను మిక్స్ చేస్తున్నాడు.
Viral Video: కప్పే కదా అని తక్కువ అంచనా వేస్తే ఇలాగే అవుతుంది.. ఈ పాము పరిస్థితి చూస్తే..
ఇసుక, సిమెంట్‌ను ఎలా కలుపుతారో.. అచ్చం అదే విధంగా ఇక్కడ కూడా ఇతను ఆహార పదార్థాలను ముందుకు, వెనక్కు లాగుతూ మొత్తం కలిసేలా మిక్స్ చేస్తాడు. ఇలా అతను చాలా సేపు ఆహార పదార్థాలను కలిపి, ఫైనల్‌గా ఘుమఘుమలాడే వంటను సిద్ధం చేస్తాడన్నమాట. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Viral Video: వీళ్లు మనుషులేనా.. రైల్లో చిరు వ్యాపారిని ఎలా మోసం చేస్తున్నారో చూడండి..
ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇతడు వంట పని చేస్తు్న్నాడా.. లేక సిమెంట్ పని చేస్తున్నాడా’’.. అంటూ కొందరు, ‘‘పారతో వంట చేయడం ఇప్పుడే చూస్తున్నాం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 200కి పైగా లైక్‌లు, 13వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Tiger And Bull Video: ఎద్దుపై పులి ఊహించని దాడి.. చివరకు జరిగింది చూస్తే.. షాకవ్వాల్సిందే..
ఇవి కూడా చదవండి..
Bride And Groom Video: ఫొటో తీస్తూ వధువును పదే పదే తాకుతున్న కెమెరామెన్.. వరుడు గమనించడంతో చివరకు..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..