Share News

Farming Viral Video: ఇది కదా తెలివంటే.. క్యారెట్లను కడిగేందుకు ఈ రైతు చేసిన పని చూడండి..

ABN , Publish Date - Feb 22 , 2025 | 01:19 PM

భూమిలో పెరిగే క్యారెట్, బంగాళాదుంపలు, ముల్లంగి వంటి పంట సాగు చేసే సమయంలో కష్టం ఎక్కువగా ఉంటుంది. పంటను కోయడం ఒక ఎత్తైతే.. వాటిని శుభ్రం చేయడం మరో ఎత్తు. అయితే ఓ రైతు ఈ సమస్యకు వినూత్న పరిష్కారాన్ని కనుగొన్నాడు..

Farming Viral Video: ఇది కదా తెలివంటే.. క్యారెట్లను కడిగేందుకు ఈ రైతు చేసిన పని చూడండి..

వ్యవసాయం చేయడంలో కొందరు రైతులు హార్డ్ వర్క్ చేస్తే.. మరికొందరు రైతులు స్మార్ట్ వర్క్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటుంటారు. మరికొందరు ప్రస్తుత టెక్నాలజీని వ్యవసాయానికి అనుసంధానం చేస్తూ అద్భుతాలు సృష్టించడం చూస్తున్నాం. ఇలాంటి వినూత్న ప్రయోగాలకు సంబంధించిన అనేక వీడియోలను సోషల్ మీడియాలో చూస్తుంటాం. తాజాగా, ఓ రైతు క్యారెట్లను శుభ్రం చేసే విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘ఇది కదా తెలివంటే’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. భూమిలో పెరిగే క్యారెట్, బంగాళాదుంపలు, ముల్లంగి వంటి పంట సాగు చేసే సమయంలో కష్టం ఎక్కువగా ఉంటుంది. పంటను కోయడం ఒక ఎత్తైతే.. వాటిని శుభ్రం చేయడం మరో ఎత్తు. అయితే ఓ రైతు ఈ సమస్యకు వినూత్న పరిష్కారాన్ని కనుగొన్నాడు.

Marriage Funny Video: చెడగొట్టారు కదరా.. జ్యూస్‌లో మందు కలిపి వరుడికి ఇవ్వడంతో.. చివరకు..


క్యారెట్లను కోసిన తర్వాత వాటిని ప్రత్యేకంగా తయారు చేసిన ఓ పెద్ద ఇనుప డ్రమ్ములో పడేశాడు. తర్వాత అందులో నీళ్లు పోసిన తర్వాత.. మూత వేసి గిరగిరా తిప్పుతాడు. ఇలా కొద్ది సేపు తిప్పిన అనంతరం వాటిని తీసి చూడగా శుభ్రంగా కనిపిస్తాయి. ఇలా క్యారెట్లను ఎంతో (farmer cleaning carrots with iron drum) సింపుల్‌గా శుభ్రం చేసేస్తాడన్నమాట. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Funny Viral Video: ఓపిక లేని మహిళ.. లిఫ్ట్ వద్ద చేసిన నిర్వాకం చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..


ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అరే.. ఈ యంత్రం చాలా బాగుందే’’.. అంటూ కొందరు, ‘‘ఈ రైతు ఐడియా మామూలుగా లేదుగా’’.. అంటూ మరికొందరు, ‘‘కాలువలో కడిగిన క్యారెట్లను తినేకంటే.. ఇలా శుభ్రం చేసిన క్యారెట్లను తినడం ఎంత మంచిది’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 లక్షలకు పైగా లైక్‌లు, 34 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: కప్పే కదా అని తక్కువ అంచనా వేస్తే ఇలాగే అవుతుంది.. ఈ పాము పరిస్థితి చూస్తే..


ఇవి కూడా చదవండి..

Bride And Groom Video: ఫొటో తీస్తూ వధువును పదే పదే తాకుతున్న కెమెరామెన్.. వరుడు గమనించడంతో చివరకు..

Viral Video: ఈ కారును ఫోలో చేస్తే గజగజా వణికిపోవాల్సిందే.. సమీపానికి వెళ్లి చూస్తే గుండె ఆగిపోయే సీన్..

Viral Video: పిల్లలకు ఫోన్లు అలవాటు చేస్తున్నారా.. ఈ చిన్నారి పరిస్థితి ఏమైందో చూస్తే షాక్ అవ్వాల్సిందే..

Elephant Attack Video: దూసుకొస్తున్న ఏనుగును చూసి రెండస్థుల పైకి ఎక్కేసిన జనం.. చివరకు జరిగింది చూస్తే..

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 22 , 2025 | 01:19 PM